- Advertisement -
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుత కర్నాటక అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉదయం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
కర్నాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఈ సారి ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించారు. మే 10న పోలింగ్ నిర్వహించి, మే 13న కౌంటింగ్ జరపనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్లకు ఏప్రిల్ 20 చివరి తేదీ కాగా, ఏప్రిల్ 21న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.
- Advertisement -