లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శనివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ పై మీడియా సమాయంలో నిర్వహించింది ఇసి. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఎపి, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, నాలుగో విడతలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగునున్నాయి.
ఇక.. ఎపిలో ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 13న ఎన్నికలు నిర్వహించి.. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఏప్రిల్ 19న, సిక్కింలో ఏప్రిల్ 19న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓడిశాలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13న తొలి విడత.. మే 26న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు.
లోక్ సభ ఎన్నికల వివరాలు:
- ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికలు
- ఏప్రిల్ 26న రెండో విడుత ఎన్నికలు
- మే 7న మూడో విడత ఎన్నికలు
- మే13న నాలుగో విడత ఎన్నికలు
- మే 20న ఐదో విడత ఎన్నికలు
- మే 25న ఆరో విడత ఎన్నికలు
- జూన్ 1న ఏడో విడత ఎన్నికలు
- జూన్ 4న దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.