Sunday, November 24, 2024

ఉనికిలో లేని 86పార్టీలపై ఈసి వేటు

- Advertisement -
- Advertisement -

ఉనికిలో లేని 86పార్టీలపై ఈసి వేటు
ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ జాబితా నుంచి తొలగింపు
253 పార్టీలు అచేతనంగా ఉన్నాయని ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా
ఎన్నికల సంఘం అధికారుల నివేదిక అనంతరం చర్యలు
తెలంగాణతోపాటు బిహార్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ పార్టీలపై త్వరలో చర్యలు
న్యూఢిల్లీ: రిజిస్టర్ అయి అచేతనంగా ఉన్న 86 రాజకీయ పార్టీలను ఎలక్షన్ కమిషన్ గుర్తింపు జాబితా నుంచి మంగళవారం తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా 253పార్టీలు అచేతనంగా ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ ఇండియా నిబంధనల ప్రకారం ఉనికిలో లేని పార్టీలపై ఈసి మే 25 నుంచి చర్యలు తీసుకోవడం ఆరంభించింది. ఈక్రమంలో చీఫ్ కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండే 86పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ప్రకటనలో తెలిపారు. చట్టపరమైన నిబంధనలను అనుసరించి ప్రజా ప్రాతనిధ్య చట్టం సెక్షన్ 29ఎ ప్రకారం ప్రతి రాజకీయపార్టీ తమ పార్టీ ప్రధాన కార్యాలయం, పార్టీ పేరు మార్పు, చిరునామా, పాన్ వివరాలను ఎటువంటి జాప్యం లేకుండా ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. ఈనేపథ్యంలో చీఫ్ ఎలక్టోరల్ అధికారులు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా పరిశీలించగా ఆయా చిరునామాల్లో ఉనికిలో లేని 86 పార్టీలను గుర్తించారు. పార్టీలకు పంపిన లెటర్లు, నోటీసులును పోస్టల్ డిపార్ట్‌మెంట్ తిరిగి ఎన్నికల సంఘానికి చేరవేయడంతో ఈసి చర్యలు చేపటింది. మే నెలలో 87పార్టీలు, జూన్‌లో 111పార్టీలను ఈసి గుర్తింపు పొందిన పార్టీల జాబితా నుంచి తొలగించింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల నివేదికను అనుసరించి మరో 253పార్టీలపై చర్యలు తీసుకోనున్నామని ఈసి ప్రకటనలో తెలిపింది. బిహార్, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ నుంచి ఈ పార్టీలు నమోదయ్యాయని ఈసి పేర్కొంది. ఈ పార్టీలు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, తాము జారీ చేసిన నోటీసులు, లేఖలకు ఎటువంటి స్పందన తెలియజేయలేదు. 2014, 2019లో జరిగిన ఆయా అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 2015నుంచి నిబంధనలు పాటించడంలో విఫలమయ్యాయి. 253పార్టీల్లో 66పార్టీలు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎన్నికల్లో పోటీ చేయలేదని ఈసి ప్రకటనలో వెల్లడించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రిజిస్టర్ రాజకీయపార్టీ ఐదేళ్లలోపు ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీచేయాలి. ఒకవేళ ఏ పార్టీ అయినా వరుసగా ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆ పార్టీని ఈసి రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగిస్తుంది.

EC Removes 86 political parties

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News