Friday, December 20, 2024

రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. రైతుభరోసా నిధులపై ఈసీ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ మంగళవారం ఆంక్షలు విధించింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. మే9 లోపు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఎన్నికల ప్రచారసభల్లో సిఎం ప్రస్తవించారని ఎన్. వేణు కుమార్ అనే వ్యక్తి రైతు భరోసా విషయంలో ఈసీకి ఫిర్యాదు చేశాడు. రైతుభరోసా చెల్లింపులపై సిఎం రేవంత్ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసినట్లు భావించిన ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియామావళి ఉల్లంఘించారని ఈసీ తెలిపింది. రైతుభరోసా పధకం కింద ప్రభుత్వం సోమవారం నిధులు విడుదల చేసింది.  ఈ నెల 8లోపు ఎట్టిపరిస్థితుల్లోనైనా సరై రైతుభరోసాకు నిధులు విడుదల చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన 24గంటలైనా గడవకముందే ప్రభుత్వం నిధుల విడుదలకు చకచకా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.2వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు రైతు భరోసా నిధులు ఆపేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News