Friday, April 18, 2025

సుర్జేవాలాపై ఇసి ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపి ఎంపి హేమమాలినిపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలాను 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్(ఇసి) మంగళవారం నిషేధించింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇసి విధించిన తొలి ప్రచార నిషేధం ఇది.

హేమమాలినిపై ‘హుందాతనం లేని, అనాగరిక, అసభ్యకర’ వ్యాఖ్యలు చేసినందుకు సుర్జేవాలకు ఎన్నికల కమిషన్ గత మంగళవారం సంజాయిషీ నోటీస్ జారీ చేసింది. సుర్జేవాలా సమాధానంలో పేర్కొన్న అంశాలు, వాదనలను జాగ్రత్తగా పరిశీలించినట్లు కమిషన్ తెలియజేసింది. ఆయన ప్రచారం నిషేధం మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు అమలులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News