న్యూఢిల్లీ : తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన నేతలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. తెలంగాణలో రైతు బంధు సహాయాన్ని ఆపివేయించింది. అలాగే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రకటనలను నిలిపివేసింది. ఈ అయిదు రాష్ట్రాల్లో డిసెంబర్ 5 వరకు విక్సిత్ భారత్‌సంకల్ప్‌యాత్ర నిర్వహించరాదని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రముఖనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలకు , అస్సాం సిఎం హిమంత బిశ్వశర్మ, తెలంగాణ సిఎం కెసిఆర్‌లకు నిబంధనలు పాటించాలని గుర్తు చేస్తూ నోటీస్‌లు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో డ్రగ్స్, నగదు, లిక్కర్, మొదలైన రూ. 1760 కోట్ల విలువైన ఉచిత సరఫరాలను ఎన్నికల అధికార యంత్రాంగం పట్టుకోవడమైంది. 2018 నాటి ఎన్నికల కన్నా ఇప్పుడు ఈ ఉచిత సరఫరాలు ఐదు రెట్లు ఎక్కువగా జరిగాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది.