Saturday, April 5, 2025

ఆ చీరలూ, డబ్బూ మంత్రి మల్లారెడ్డివేనా?

- Advertisement -
- Advertisement -

ఎన్నికల తేదీ దగ్గరపడినకొద్దీ ఎన్నికల సంఘం సిబ్బంది దాడులు పెరుగుతున్నాయి. తాజాగా తమకు అందిన కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘానికి చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది మేడ్చల్ నియోజకవర్గంలోని ఫీర్జాదీగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్ కు చెందిన ఒక ఆఫీసుపై దాడి చేశారు. అక్కడ పెట్టెల్లో భద్రపరిచిన 74 చీరలను, రెండు లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. ప్యాక్ చేసిన చీరల్లో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి కరపత్రాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News