Sunday, January 19, 2025

ఇసి సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

15 రాజకీయ ప్రకటనలను నిలిపివేసిన సిఇఒ టీవీ, సోషల్ మీడియా ఛానెళ్లకు లేఖ

ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నట్లు నిర్ధారణ

వీడియోలు, క్లిప్పులను లేఖతో జతపర్చిన సిఇఒ కార్యాలయం

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలకు సం బంధించిన అన్ని రకాల రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సిఇఒ ఆదేశాలు జారీ చేశారు. చానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు తెలంగాణ సిఇఒ శనివారం లేఖలు రాసినట్లు తెలిపారు. అ సెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొన్నా రు. ఇష్టానుసారంగా మార్చి ప్రసారం చేస్తూ మో డల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తున్న కారణం గా ఆ ప్రకటనలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం లేఖలో వెల్లడించింది. ఆ ప్రకటనల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఛానళ్లకు సూచించింది. ప్రకటనలకు సంబంధించిన కొన్ని వీడియో, క్లిప్‌లను కూడా జతపరచినట్లు సిఇఒ కార్యాలయం తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News