Wednesday, January 22, 2025

రాజాసింగ్ వ్యాఖ్యలపై ఇసి సీరియస్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయకపోతే బుల్డోజర్‌లతో తొక్కిస్తామంటూ బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో విషయం ఎన్నికల సంఘం వరకు వెళ్లడంతో.. ఇసి సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోరింది. కాగా, యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన రాజాసింగ్.. యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాచరు. ఈ మేరకు రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేశారు. మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ.. యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ పోలింగ్‌లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు.
రాజాసింగ్‌ను తక్షణం అరెస్టు చేయాలి..
యూపీలో ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ బాహాటంగా వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సిఎం కెసిఆర్ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని, ఇసి స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

EC Serious On BJP MLA Raja Singh’s Comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News