Monday, January 20, 2025

కర్నాటక డిప్యూటీ సిఎంను కలిసిన ఈసి శేఖర్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

ఆదిభట్ల: కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్‌పార్టీ స్టాల్‌వార్ట్ డికె శివకుమార్‌ను కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు ఈసిశేఖర్‌గౌడ్ (మామ) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం బెంగళూర్‌లోని డిప్యూటీ సిఎం కార్యాలయంలో శివకుమార్‌ను కలిసిన శేఖర్‌గౌడ్ ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఈసి శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను గెలిపించి కర్నాటక ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు.

కర్నాటకలో హస్తం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో డికె శివకుమార్ పోషించిన పాత్ర మరిచిపోలేనిదని అన్నారు. కాంగ్రెస్ శ్రేణుల గుండెల్లో డికె శివకుమార్ ఓ స్టాల్‌వార్ట్‌గా నిలిచారని ఆయన ప్రశంసించారు. కర్నాటక స్ఫూర్తితో దేశమంతటా హస్తం జెండాను రెపరెపలాడిస్తామని ఆయన ధీమా వ్యకంచేశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News