ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
కాంగ్రెస్‌పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఇసికి అందిన ఫిర్యాదు
అధికారులు తెలంగాణ మాండలికాన్ని అర్థం చేసుకోలేకపోయారని కెసిఆర్ వివరణ
సంతృప్తి చెందని ఎన్నికల సంఘం…అమలులోకి వచ్చిన నిషేధం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆయన రెండ్రోజు ల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ బ్యాన్ ఆయనపై బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఉంటుందని స్పష్టం చేసింది. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పా ర్టీపై అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యా ఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై ఈ నిషేధం విధించినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. సిరిసిల్లలో ఏప్రిల్ 5న కెసిఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పాటు, తమ పార్టీ నేతల ను ఉద్దేశించి అభ్యంతరకరంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌నేత నిరంజన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అది ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని ఫిర్యాదులో వెల్లడించారు. దాంతో ఇసి విచారణ చేపట్టింది. అనంతరం కెసిఆర్ నుంచి వివరణ కూడా సేకరించింది. స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయారని కెసిఆర్ వివరణ ఇచ్చారు. దీనిపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. దీంతో ఎన్నికల కోడ్‌ను కెసిఆర్ ఉల్లంఘించారని భావించి చర్యలు తీసుకుంది. మే 1న రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కెసిఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయొద్దని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు అంటే శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఆయన ప్రచారంపై నిషేధం వర్తిస్తుంది.
నిషేధంపై ఎన్నికల సంఘం వివరణ
కెసిఆర్ ఇచ్చిన వివరణపై ఇసి సంతృప్తిని చెందలే దు. సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఇసి స్పష్టపర్చింది. గతంలోనూ ఎన్నికల సమయంలో కెసిఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పార్టీ అధినేతగా, స్టార్ క్యాంపెయినర్‌గా కెసిఆర్ ఎన్నికల నియమావళిని పాటించి ఇతర నేతలకు ఆదర్శంగా నిలవాలని సూచించింది. అందుకే 48 గంటల పాటు బహిరంగసభలు, ర్యా లీలు, ఇంటర్వ్యూలు, మీడియాతో మాట్లాడరాదని నిషేధం విధించింది. ఈ నిషేధ ఆదేశాలు బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి 48 గంటల పాటు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ 48 గంటలు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది.
ఇక్కడి భాషా మాండలికం ఢిల్లీ వాళ్లకు ఏం తెలుసు? : కెసిఆర్
తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఇసి తీసుకున్న చర్యలపై కెసిఆర్ స్పందించారు. తన మాటలను ఎన్నికల అధికారులు సరిగా అర్థం చేసుకోలేదని.. ఇక్కడి భాషా మాండలికం ఢిల్లీలోని ఎన్నికల అధికారులకు అర్థం కాలేదన్నారు. కాంగ్రెస్ నేతలు కావాలనే ఈ ఫిర్యాదు చేశారన్నారు. తాను మాట్లాడిన మాటల్లో నుంచి కొన్ని వ్యాఖ్యలను ఎం పిక చేసుకొని వాటిపైనే ఫిర్యాదు చేశారని అన్నారు. తన వ్యాఖ్యలను ఇంగ్లిషులోకి తర్జమా చేయడం సరికాదన్నారు. తాను సి రిసిల్లలో కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో ఫెయిల్యూర్‌నే ప్రస్తావించానన్నారు. తన మాటలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించి ఎన్నికల సంఘానికి సమర్పించారని కెసిఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇదెక్కడి అరాచకం? తెలంగాణ ఆవాజ్ కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్ ధ్వజం
ఏకంగా తెలంగాణ అవాజ్ కెసిఆర్ గొంతుపైనే నిషేధ మా? అంటూ ఇదెక్కడి అ రాచకం అంటూ బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కెటిఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మోడీ విద్వేష వ్యాఖ్యలు ఇసికి వినిపించలేదా? మోడీ ప్రసంగాలపై వేల ఫిర్యాదులు వచ్చినా చర్యల్లేవు అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ బూ తులు ఇసికి ప్రవచనాల్లాగా అనిపించాయా? వి రుచుకుపడ్డారు. బడే భాయ్, చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా? ఇది అంటూ ఎక్స్ వేదికగా కెటిఆర్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కెసిఆర్ పోరుబాట కార్యక్రమం చూసి ఎందుకు కాం గ్రెస్, బిజెపి వాళ్లు వణికిపోతున్నారని ప్రశ్నించారు. అందుకే మీ అహంకారానికి, సంస్థాగత దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు.