Sunday, December 22, 2024

రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్.. అనుమతిని ఉపసంహరించుకున్న ఈసీ

- Advertisement -
- Advertisement -

రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది.రెండు రోజల క్రితం రైతుబంధు నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, న్నికల ప్రచార సభలపై రైతుబంధు గురించి ప్రస్తావించరాదని, ఎన్నికల్లో లబ్ధిపొందేలా వ్యాఖ్యలు చేయరాదని ఈసీ ముందే షరతు విధించింది. అయినా, బీఆర్ఎస్ నాయకులు రైతుబంధును ప్రస్తావించారని.. సీఈసీ నిబంధనలు ఉల్లంఘించడంతో రైతుబంధు నిధుల విడుదలకు అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. హరీశ్ రావు తన సభల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగించారని ఈసీ పేర్కొంది. ఈసీ నిర్ణయంతో రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ పడింది.

కాగా, రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. నవంబర్ 30న ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు రైతు బంధు నిధుల విడుదలకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలా అనుమతిస్తారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మోడీ చెప్పడంతోనే కేసీఆర్ కు.. ఈసీ అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News