Friday, December 20, 2024

బంగ్లాదేశ్ లో హిందువుల వ్యతలకు అంతులేదా?

- Advertisement -
- Advertisement -

ఢాఖా: భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి పొరుగున ఉన్న బంగ్లాదేశ్(గతంలో తూర్పు పాకిస్థాన్) సరిహద్దులో ఎప్పుడూ ప సమస్య ఉంటూ వచ్చింది. ఇందిరా గాంధీ చర్య తీసుకోక ముందు అనేక మంది బంగ్లాదేశీలు శరణార్థులుగా ఇండియాలోకి వచ్చారు. వారికి నాడు అభయం ఇచ్చి ఆదుకోవడం జరిగింది. కానీ కొన్ని దశాబ్దాలు గడిచాక అక్కడ హిందువుల పరిస్థితి ఇప్పుడు తారుమారవుతున్నాయి. బెంగాలీ హిందువులు భద్రత విషయంలో అక్కడ గగ్గోలు పెడుతున్నారు. మైనారిటీ హక్కులకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ భారత్ కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసేసి చూసుకుంటుందని చేతులు దులిపేసుకుంది.

భారత్ కు వలసొచ్చిన సుశీల్ గంగోపాధ్యాయ బంగ్లాదేశ్ లోని నోఖలి జిల్లాకు చెందిన వాడు. అక్కడ అతడికి పెద్ద కుటుంబం ఉండేది. అనేక గృహాలు దహనకాండకు గురికావడం, అనేక మంది కిరాతకంగా హతమవ్వడంతో అతడు ఇండియాలోకి వచ్చేశాడు. ఒకప్పుడు బంగ్లాదేశ్ లో అతడి కుటుంబానికి భూములు ఉండేవి. ‘‘ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులను బాధిస్తే మనం ‘క్విట్ ఇండియా’ వంటి ఉద్యమాన్ని బంగ్లాదేశ్ లో తేవాలి’’ అన్నారు. 1971లో తాను కేవలం 10 లేక 12 ఏళ్ల వాడినని సుశీల్ గంగోపాధ్యాయ తెలిపారు.

అనిమా దాస్ అనే మహిళ బంగావ్ కు చెందినామె. ఆమె బంగ్లాదేశ్ వదిలి పారిపోయి వచ్చినప్పుడు గర్భవతి. ఆమె కూతుదరప్పుడు కడుపులో ఉంది. మా అత్తగారు నాడు మమ్మల్ని ఇండియాకు పంపించేసింది.మా మామగారిని కూడా ఇండియాకు పంపించేశారు. నేను తర్వాత అనేక సార్లు బంగ్లాదేశ్ వెళ్లాను. కానీ తిరిగి అక్కడ నివసించాలనే ఆలోచనే నాకు రాలేదు’’ అన్నారు.

హరధన్ బిశ్వాస్ మాట్లాడుతూ ‘‘బంగ్లాదేశ్ లో హిందువులు నిరంతరం అభద్రతతో బతుకుతుంటారు. అందుకనే చాలా మంది బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి వస్తున్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం తర్వాత కూడా చాలా మంది బంగ్లాదేశీయులు ఇక్కడే ఉండిపోయారు’’ అన్నారు.

న్యూటౌన్ లో నివసిస్తున్న రష్మోయ్ బిశ్వాస్ మాట్లాడుతూ ‘‘ బంగ్లాదేశ్ లో వచ్చాక కూడా అక్కడ హిందువుగా ఉండడం నేరమైపోయింది. నాడు పాకిస్థాన్ సైన్యం, జమాత్ శక్తులు మమ్మల్ని లక్ష్యం చేసుకున్నాయి. మా ఇళ్లపై దాడులు చేశాయి. ఇప్పుడు మేము ఇండియాలో శాంతిగా బతుతకుతున్నాము. భారత ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని బంగ్లాదేశ్ లో హిందువులు నిమ్మదితో బతికేలా చూడాలి’’ అన్నారు.

 

Anima Das

Rasmoy Das

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News