కేంద్ర ఎన్నికల సంఘం కీలక
ప్రకటన కేంద్ర హోంశాఖ,
సమాచారశాఖలతో ఎన్నికల
కమిషన్ భేటీ రాజ్యాంగంలోని
326 అధికరణ,
ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని
నిబంధనల మేరకు నిర్ణయం
త్వరలో సాంకేతిక నిపుణులతో
సంప్రదింపులు
న్యూఢిల్లీ : విశిష్ట గుర్తింపు సంఖ్య గల కార్డు ఆధార్‌తో వోటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల కమిషన్ (ఇసి) మొగ్గు చూపింది. ప్రస్తుత చట్టం, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆధార్‌తో వోటర్ కార్డును అనుసంధానిస్తామని ఇసి మంగళవారం ప్రకటించింది. ఈ ప్రక్రియ నిమిత్తం యుఐడిఎఐ, దాని ని పుణులతో సాంకేతికపరమైన సంప్రదింపులను ‘త్వరలో ప్రారంభించగలం’ అని ఇసి తెలియజేసింది. వోటర్ కార్డు, ఆధార్ అనుసంధానం విషయమై ఇసి మంగళవారం కేంద్ర హోమ్ కార్యదర్శి, (న్యాయ మంత్రిత్వశాఖలోని) శాసన వ్యవహారాల కార్యదరి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, యుఐడిఎ ఐ సిఇఒలతో సమావేశం నిర్వహించింది. వోటింగ్ హక్కులు భారత పౌరునికి మాత్రమే మంజూరు చే స్తుండగా, రాజ్యాంగంలోని 326 అధికరణం ప్రకా రం ఆధార్ ఒక వ్యక్తి గుర్తింపును నిర్ధారిస్తుందని ఇసి ఒక ప్రకటనలో తెలియజేసింది.
‘అందువల్ల రాజ్యాంగం 326 అధికరణం, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్లు 23(4), 23(5), 23(6) నిబంధనల ప్రకారం, (2023 నాటి) సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఆధార్‌తో వోటర్ ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్)ను అనుసంధానించాలని నిర్ణయించడమైంది’ అని ఇసి వివరించింది. తదనుగుణంగా యుఐడిఎఐ, ఇసి సాంకేతిక నిపుణుల మధ్య సాంకేతికపరమైన సంప్రదింపులు ‘త్వరలో ప్రారంభం కానున్నాయి’ అని ఇసి తెలియజేసింది. ఆధార్ డేటాబేస్‌తో వోటర్ల జాబితాల ఐచ్ఛిక అనుసంధానాన్ని చట్టం అనుమతిస్తున్నది. కాగా, ఆధార్ వోటర్ కార్డు అనుసంధానం ప్రక్రియకు ఎటువంటి లక్ష్యాన్ని లేదా కాలపరిమితులను నిర్దేశించలేదరి ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. తమ ఆధార్ వివరాలను వోటర్ల జాబితాతో అనుసంధానం చేయనివారి పేర్లను వోటర్ల జాబితాల్లో నుంచి తొలగించడం జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల శాసనాలు (సవరణ) చట్టం 2021 ద్వారార సవరించిన ప్రకారం 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 23 కింద ఐచ్ఛికంగా గుర్తింపును నిర్ధారించేందుకు ఆధార్ కార్డు చూపాలని ప్రస్తుత లేదా రాబోయే వోటర్‌ను వోటర్ల నమోదు అధికారులు కోరడానికి వీలు కల్పిస్తోంది.