Sunday, December 22, 2024

ఇసికి ప్యానెల్ జాబితా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పలువురు కలెక్ట ర్లు, కమిషనర్లను బదిలీ చేయాలంటూ కేంద్ర ఎ న్నికల సంఘం పంపిన ఆదేశాలను రాష్ట్ర ప్రభు త్వం అమలు చేసింది. ఈ మేరకు అధికారుల బ దిలీ, ఆ స్థానాల్లో ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల చొప్పున ప్యానెల్ జాబితాను ఎన్నికల సంఘానికి పంపింది. మొత్తం నలుగురు కలెక్ట ర్లు, ముగ్గురు పోలీస్ కమిషనర్లులు, 10 మంది ఎస్పీలతో రవాణా, ఎక్సైజ్, వాణిజ్య ప న్ను ల శాఖల కార్యదర్శులు, కమిషనర్ల పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రతి పోస్టుకు ముగ్గురి పే ర్లతో ప్యానెల్ జాబితాను పంపారు. భాగంగా పోలీస్ శాఖలో బదిలీ అయిన కమిషనర్లు, ఎస్పీల స్థానంలో కొత్త పోస్టింగ్ కోసం డి జిపి అంజనీకుమార్ ఒక్కో పోస్టుకు సీనియారిటీ ప్రాతిపదికన ముగ్గురు ఐపిఎస్‌లను పేర్లను సూ చిస్తూ జాబితాను సిఎస్‌కు పంపించారు. ఈ ప్యానెల్ నుంచి ఒక్కొక్కరిని కేంద్ర ఎన్నికల సం ఘం ఎంపిక చేయనుంది.

ప్రధానంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌పైనే అందరి దృష్టి ఉంది. అదనపు డిజి ర్యాంకు కలిగిన హైదరాబాద్ సిపి గా ఇప్పటివరకు డిజిపి హోదాలో ఉన్న సివి ఆ నంద్ విధులు నిర్వహించారు.ప్రస్తుతం అదనపు డిజి హోదా ఉన్న సీనియర్ ఐపిఎస్ పేర్లను డిజిపి పంపించినట్లు తెలుస్తోంది. అదనపు డిజిల సీనియారిటీలో మొదట కొత్తకోట శ్రీనివా రెడ్డి, ఆ తర్వాత శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, షికాగోయల్, వీవీ శ్రీనివాస్ రావు, మహేశ్ భగవత్, సజ్జనార్, నాగిరెడ్డి ఉన్నారు. ఇందులో ముగ్గురు పేర్లను పంపాల్సి ఉండటంతో.. ఎవరెవరి పేర్లు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లాయనేది ఆసక్తిగా మారింది. వరంగల్, నిజామాబాద్ కమిషనర్లకు ఐజి ర్యాంకు ఉన్న ఐపిఎస్ పేర్లు పంపించారు. జిల్లాల్లో ఎస్పీల పోస్టింగ్‌ల కోసం ఐపిఎస్‌ల పేర్లను పంపించారు. ఒక్కో పోస్టింగ్‌కు మూడు పేర్ల చొప్పున మొత్తం 39 మంది పేర్లతో జాబితా సిద్ధం చేసిన డిజిపి.. ఆ జాబితాను సిఎస్‌కు పంపించారు.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఎస్ పంపించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఎన్నికల సంఘం సమీక్ష అనంతరం అధికారుల పనితీరు, వారిపై వచ్చిన ఫిర్యాదులు, గత అనుభవాలు, తదితరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను బదిలీ చేసింది. డబ్బు, మద్యం, ఇతరత్రాల పంపిణీ, మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా వచ్చిన ఫిర్యాదులు సహా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం తెలంగాణలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలను ఇసి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కింది వారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి తక్షణమే రిలీవ్ కావాలని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News