Sunday, December 22, 2024

మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉపఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల14 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 15న నామినేషన్లను ఈసి పరిశీలించనుంది. ఇక, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వరకు గడువు ఇచ్చింది. కాగా, ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ టిఆర్ఎస్ తోపాటు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే  మునుగోడులో జోరుగా ప్రచారాలు మొదలెట్టిన విషయం తెలసిందే. ఈ ఉపఎన్నికకు కాంగ్రెస్ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిరెడ్డి ప్రకటించగా.. బిజెపి పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.

ECI Releases Schedule for Munugode Bypolls

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News