Saturday, December 21, 2024

తెలంగాణలో బోగస్ ఓటర్ల ఏరివేత!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత ఎన్నికల సంఘం(ఈసిఐ) గురువారం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. తెలంగాణ జాబితాలో 2022లో ప్రచురించిన ముసాయిదా జాబితాలో ఓటర్లు 3.03 కోట్లు ఉండగా అది ఇప్పుడు 2.99 కోట్లకు తగ్గింది. ఇలా ఎందుకు జరిగిందంటే బోగస్ ఓటర్ల ఏరివేత కారణంగానే. ఈసిఐ నిరంతరం అప్‌డేషన్ ప్రాసెస్‌ను చేపడుతుండడం వల్ల 3.45 కొత్త ఓటర్లు చేరగా, వివిధ కారణాలరీత్యా 11.36 లక్షల ఓటర్లు జాబితా నుంచి తొలగించబడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం ఓటర్లు 29992941 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు 39984868 మంది ఉన్నారు.

ఓటర్ల జాబితాను విడుదల చేసిన చీఫ్ ఎలెక్టొరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 4215456 మంది ఓటర్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 3108068 మంది ఓటర్లు ఉన్నారు. కాగా మెడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 2524951 ఓటర్లు ఉన్నారు.

శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 644072 ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 142813 ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో 18 నుంచి 19 మధ్య ఉన్న ఓటర్లు 278650కి పెరిగారు. పురుష ఓటర్లు 15048250 ఉండగా, మహిళా ఓటర్లు 14924718 ఉన్నారు. కాగా ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 2740 మంది, సర్వీస్ ఓటర్లు 15282 మంది ఉన్నారు.

ఎవరైనా తమ పేరును ఓటర్ల జాబితాలో చూసుకోవాలనుకుంటే ‘నేషనల్ ఓటర్ల సర్వీస్ పోర్టల్ ’ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పోర్టల్‌లో వ్యక్తిగత వివరాలు…అంటే పేరు, పుట్టిన తేదీ, అసెంబ్లీ నియోజకవర్గం తదితరాలు పూరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వివరాలు పూర్తిచేశాక ఓటర్ సమాచారం స్క్రీన్ మీద కనిపిస్తుంది. తెలంగాణలోని వారంతా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే మున్ముందు ఒకవేళ దేశవ్యాప్తంగా ‘నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజెన్స్’(ఎన్‌ఆర్‌సి) నిర్వహిస్తే ఈ ఓటర్ నమోదు ముఖ్య ఆధారంగా ఉండనుంది. అస్సాంలో చాలా మంది ప్రజలు తమ జాతీయతను నిరూపించుకోలేక ఎటూ కానీవారిగా మిగిలిపోయారు. అస్సాం ఎన్‌ఆర్‌సి తర్వాత ఓటరు ఐడి కార్డు కూడా ఓ ముఖ్యమైన ఆధారంగా మారింది. కొత్తగా రిజిష్టరు కావాలనుకున్నవారు, లేదా తమ వివరాలు సవరించాలనుకున్నవారు నేషనల్ ఓటర్స్ సర్వీసు పోర్టల్‌కు వెళ్లి నమోదు ప్రక్రియను పూర్తిచేసుకోవాలి.

Telangana Voters

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News