Thursday, January 9, 2025

పట్టణాల్లో ఐటి వెలుగులు.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హెల్త్ కెేర్‌లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న 30 హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (హెచ్‌ఐఎస్), ఇసిఎల్‌ఎటి హెల్త్ సొల్యూషన్స్ సంయుక్తంగా తెలంగాణలోని కరీంనగర్‌లో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డిసిలో జరిగిన సమావేశంలో 3ఎం, ఇసిఎల్‌ఎటి అధికారులతో మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌తో ఆ సంస్థలు ఒప్పందం కుదర్చుకున్నాయి. కరీంనగర్ కేంద్రంలో ఆ సెంటర్ మెడికల్ కోడింగ్, క్లీనికల్ డాక్యుమెంటేషన్ సేవల్ని అందించనుంది. కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్న ఇసిఎల్‌ఎటి ఆపరేషన్స్ సెంటర్‌లో వంద మందకి ఉద్యోగం కల్పించనున్నారు. ఆ తర్వాత ఆ సెంటర్‌లో ఉద్యోగుల సంఖ్యను 200కు పెంచనున్నట్లు పేర్కొన్నారు. ఇసిఎల్‌ఎటి హెల్త్ కేర్ సంస్థతో కుదిని ఒప్పందం గురించి మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు.

దాదాపు 40 ఏళ్ల నుంచి 3 ఎం హెచ్‌ఐఎస్ హెల్త్ కేర్ రంగంలో సేవలనందిస్తోంది. ఆ సంస్థ అత్యాధునిక హెల్త్ కేర్ వ్యవస్థను డెవలప్ చేసింది. దాదాపు 18 దేశాల్లో ఆ సంస్థ సేవలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్నందించడమే లక్షంగా ఆ సంస్థ సేవలంది స్తోంది. తెలంగాణ ప్రభుత్వం, 3ఎంతో పాటు ఇసిఎల్‌ఎటి మధ్య సహకారం గురించి సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కరీంనగర్ సెంటర్ ద్వారా మెడికల్ కోడింగ్, సంబంధిత టెక్నాలజీ సేవల గురించి పనిచేయనున్నట్లు ఇసిఎల్‌ఎటి హెల్త్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు, గ్రూపు సిఇఒ కార్తీక్ తెలిపారు. 3ఎంతో భాగస్వామ్యం ఏర్పడటం సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వ విజన్ తమను ఆకర్షిస్తున్నట్లు 3ఎం హెచ్‌ఐఎస్ ఎండి సందీప్ వాద్వా తెలిపారు. ఈ ఒప్పందంతో తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్‌ను ప్రమోట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News