Tuesday, April 8, 2025

ఆ నలుగురి సంపద రూ.85వేల కోట్లు ఆవిరి

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రపంచ ఆర్థిక మాంద్యం భయం కారణంగా భా రత దేశంలోని టాప్ 4 బిలియనీర్లు అయిన ముకేశ్ అంబానీ, గౌత మ్ అదానీ, సావిత్రి జిందార్, ఫ్యామిలీ, శివ్‌నాడార్‌ల సం పద ఒకే రోజులో 10.3 బిలియన్ డాలర్లు (రూ.88,460 కో ట్లు) క్షీణించింది. సెన్సెక్స్ 3 వేల పాయింట్లకు పైగా పడిపోగా, మ రోవైపు నిఫ్టీ 22,000 దిగువకు పడిపోయింది. ఈ పతనం వల్ల దేశంలోని నలుగురు అత్యంత ధనవంతులు ఎక్కువగా ప్ర భా వితమయ్యారు. వారి సంపద కొన్ని గంటల్లోనే 10.3 బిలి య న్ డాలర్లు తగ్గింది.

ఈ పతనంలో రియల్ టైమ్ ఫోర్బ్ బిలి యనీర్ల జాబితాలో భారతదేశపు అత్యంత ధనవంతుడైన పారి శ్రామికవేత్త ముకేశ్ అంబానీకి అతిపెద్ద దెబ్బ తగిలింది. ఆయన మొత్తం సంపద 3.6 బిలియన్ డాలర్లు తగ్గి 87.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గౌతమ్ అదానీ కూడా 3 బిలియన్ డాలర్లు కోల్పోగా, ఇప్పుడు ఆయన సంపద 57.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ జాబితాలో సావిత్రి జిందాల్, ఫ్యామిలీ 2.2 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూడగా, వారి నికర విలువ 33.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. టెక్నాలజీ దిగ్గజం శివ్ నాడార్ సంపద కూడా 1.5 బిలియన్ డాలర్లు తగ్గి 30.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News