Thursday, January 9, 2025

పన్నులు పెంచడమే పాలన కాదు

- Advertisement -
- Advertisement -

వడ్డింపులు లేకుండా ఆదాయాన్ని పెంచిన తెలంగాణ

కేంద్రం కక్షగట్టినా ఆగని అభివృద్ధి, సంక్షేమ పథకాలతో
ఆర్ధికాభివృద్ధి తలెత్తుకునేలా చేసిన నీరు, విద్యుత్తు రైతు బాగుంటేనే
రాష్ట్రం బాగు నగదు బదిలీలతో ఎకనామిక్ యాక్టివిటీ

మన తెలంగాణ/హైదరాబాద్: ‘ప్రభుత్వ పాలన అంటే పన్నులు పెంచడం, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టడ మే’ సాగుతున్న కేంద్ర ప్రభు త్వ పాలనకు, పాలన అంటేనే ప్రజలపై అదనపు పన్నులు విధించకుండా, ప్రజల కష్టాలు- తెలుసుకొని వాటి ని తీరుస్తూ జనరంజకంగా పాలించడమేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించిన వైనమే ఇప్పుడు దేశంలో చర్చనీయాంశమైంది. నగదు బదిలీ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన వంటి రంగాల్లో లక్షల కోట్ల రూ పాయల నిధులను ఖర్చు చేయడం మూ లంగా సర్వతోముఖాభివృద్ధిని సాధించవచ్చునని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నమ్మడమే కాకుండా ఆచరణలోపెట్టి నిరూపించిందనే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభు త్వం ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముకొని సొమ్ముచేసుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులు, రో డ్లు, ప్రభుత్వ భవనాలు నిర్మిస్తూ, పరిశ్రమలు, ఐటి, ఫార్మా రంగాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వ ఆస్తులను పెంచుకొంటూ ముందుకు సాగుతోంది.

అంతేగాక వ్యవసాయం, దాని అనుబంధ రం గాలు, నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మి స్తూ అభివృద్ధి చేస్తూనే మరోవైపు దళితబంధు, కళ్యాణలక్ష్మీ, ఆసరా పెన్షన్లు, షాదీ ముబారక్, కులవృత్తులకు సబ్సిడీ లు, రాయితీలు ఇస్తూ సంక్షేమ రంగాలను సమర్థ్ధవంతంగా అమలు చేస్తుండ టంతోనే రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఎకనమిక్ యాక్టివిటీ జరుగుతోందని, అం దుకే రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయం గా పెరిగిందనే వాస్తవాలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఏడేళ్ల కాలంలోనే కృష్ణా, గోదావరి నదుల నుం చి 300 టిఎంసిల నీటిని సాగునీరు, తాగునీటికి వినియోగంలోకి తీసుకు రావడంతో, మిషన్ కాకతీయ పథకంలో 54 వేల చెరువుల్లో పుష్కలంగా నీటిని నింపడంతో భూగర్భ జలాలు రికార్డుస్థాయిలో పెరిగాయి. ప్రభుత్వ పాలనను ప్రజలవద్దకు తీసుకెళ్లేందుకు 33 జిల్లాలను ఏర్పా టు చేసుకొని, కొత్తగా కలెక్టరేట్ భవనాల ను నిర్మించుకోవడం, ఎంఎల్‌ఎలు, ఎంపి లు కూడా నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా వా రికి ప్రత్యేకంగా కార్యాలయ భవనాలను ఏర్పాటు చేసుకోవడం, మండల కేంద్రాలను ప్రజలకు మరింత చేరువగా చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 594 రెవెన్యూ మండలాలున్నాయి.

ఈ మండలాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికితోడు తెలంగాణ రాష్ట్రం సిద్దించిన 2014లో తలసరి ఆదాయం 1,12,,162 రూపాయలు ఉండగా 2022వ సంవత్సరం మార్చి నెలాఖరు నాటికి తలసరి ఆదాయం 2,78,833 రూపాయలకు పెరిగింది. అంటే గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో ప్రభుత్వం చేపట్టిన విధానాల మూలంగా రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపయ్యింది. అంతేగాక 2014వ ఏడాది జూన్ నాటికి తెలంగాణ రాష్ట్ర జి.ఎస్.డి.పి. 4,51,580 కోట్ల రూపాయలు ఉండగా అదికాస్తా 2022 మేనెలాఖరు నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలే నిపుణులు, మేధావి వర్గాన్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. అందుకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న ఫలితాలే నిలువెత్తు నిదర్శనమనే వ్యవసాయ నిపుణులు, మేధావులు అంటున్నారు.

అంతేగాక సంక్షేమ రంగాల్లో కూడా వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసి కూడా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చునని కూడా తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందని, అందుకే ఈ పథకాల అమలుతీరును, రాష్ట్రంలో జరుగుతున్న ఎకనమిక్ యాక్టివిటీని ఆర్థ్ధిక నిపుణులు, మేధావులు, జాతీయ మీడియాలోని సీనియర్ పాత్రికేయులు సైతం అధ్యయనం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మొదటగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఒక సంచలనమని, ఆ పథకాన్ని కొనియాడుతూ ప్రఖ్యాత వ్యవసాయ రంగ నిపుణులు స్వామినాథన్ కూడా వ్యాఖ్యానించడం, ఇటీవల పలు రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు కూడా రాష్ట్రంలో పర్యటించి ప్రత్యక్షంగా చూడటంతో తెలంగాణ పథకాలు దేశానికి రోల్‌మోడల్‌గా ప్రచారం పొందాయి.

అంతేగాక వ్యవసాయానికి 24 గంటల పాటూ ఉచిత విద్యుత్తు సరఫరా, రైతుబీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఒక కోటి 35 లక్షల ఎకరాలకు సాగునీరు, మారుమూల పల్లెల్లోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ పథకంతో నల్లానీరు (తాగునీరు) సరఫరా చేయడం వంటి, రైతులకు గిట్టుబాటు ధరలు లభించేటట్లు చేసేందుకు ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక గోదాముల నిర్మాణాలు, మార్కెట్లు ఏర్పాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, విత్తనాలు, ఎరువులు సబ్సిడీలపై రైతులకు అందించడం వంటివి మేధావి వర్గాన్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకైక ప్రభుత్వమనే విషయం తేటతెల్లమయ్యింది. ఈ మొత్తం అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుండటంతోనే ఎకనమిక్ యాక్టివిటీ భారీగా పెరగడం, తద్వారా పన్నులు, పన్నేతర ఆదాయం కూడా అదే విధంగా పెరుగుతుండటంతోనే ప్రభుత్వ ఖజానాకు రికార్డుస్థాయిలో ఆదాయం చేకూరుతూనే ఉంది.

సంక్షేమ పథకాలతో కూడా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చునని నిరూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడంతోనే ఇక్కడి ఆర్థిక విధానాలను కూడా నిపుణులు అధ్యయం చేశారు. అంతేగాక సాక్షాత్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ), నీతి ఆయోగ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలే తెలంగాణ ఆర్ధిక విధానాలు, అభివృద్ధి-, సంక్షేమ పథకాలను కొనియాడాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సుమారు 16 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతుండగా అందులో 12 వేల కోట్ల రూపాయల నిధులు సొంత ఆదాయం నుంచే వస్తున్నాయి. మిగతా నాలుగు వేల కోట్ల రూపాయలను సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచి ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి లోబడే రుణాలను సేకరించుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం రుణాల సేకరణకు సహకరించకపోగా, కుంటిసాకులు చూపించి అడ్డంకులు సృష్టిస్తూ వచ్చింది. దాంతో ఈ ఏడాది రమారమి 20వేల కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చిందని, అంతేగాక కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు సుమారు 34,147 కోట్ల రూపాయల నిధులను కూడా కేంద్రం ఎగ్గొట్టి వేధింపులకు గురిచేస్తున్న వైనం కూడా జాతీయస్థాయిలో సరికొత్త చర్చకు తెరతీసిందని ఆర్థికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

అంతేగాక కేంద్ర ప్రభుత్వ ఆర్ధికమంత్రిత్వశాఖలోని కొందరు సీనియర్ అధికారులకు కూడా ఈ అంశాలపై తెలంగాణ రాష్ట్రంపట్ల సానుభూతి కూడా ఉందని తెలిపారు. నీతి ఆయోగ్ సిఫారసులు, 14వ, 15వ ఆర్థిక సంఘాల సిఫారసులను కేంద్రం అమలు చేసినా, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టంలో మార్పులు చేర్పులు చేసి వేధించకుండా, పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా నిధుల్లో కోతలు విధించకుండా ఉన్నట్లయితే తెలంగాణకు కనీసం మరో 90 వేల కోట్ల రూపాయల నిధులు సమకూరేవి. వాటితో అభివృద్ధి-సంక్షేమ పథకాలు మునుపెన్నడూ ఊహించని విధంగా తెలంగాణలో అమలయ్యేవి. ఈ విషయంపైన కూడా రాష్ట్రంలో పర్యటించిన రైతు సంఘాల నాయకులు, నిపుణులు, మేధావులకు స్పష్టంగా వివరించామన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయాలపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News