Monday, December 23, 2024

స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -

మక్తల్ ః స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు మరి కొంతమందికి ఉపాధిని కల్పించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి ఆహార ఉత్పత్తి పరిశ్రమ పథకం ద్వారా మాగనూరు మండలం వర్కూరుకు చెందిన కావలి సిద్ధమ్మకు మంజూరైన రొట్టెల తయారీ యూనిట్‌ను బుధవారం మక్తల్ పట్టణంలోని సంగంబండ రోడ్డులో ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు దేవరి మల్లప్ప, మహిపాల్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, గవినోళ్ల నర్సింహారెడ్డి, ఎపిఎం వనితకుమారి, సిసి గంగాధర్, అకౌంటెంట్ రుక్మిణి, విఒఎలు బాబు, పార్వతి, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News