రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: కొవిడ్-19 కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని మరో మోసంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఏ పేద కుటుంబానికి తమ రోజువారీ జీవన అవసరాలకు ఈ ఆర్థిక ప్యాకేజీ వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా ప్రభావిత రంగాలకు ఆర్థిక మంత్రి ప్రకటించిన లక్ష కోట్ల ప్యాకేజీపై రాహుల్ మంగళవారం స్పందిస్తూ ఆర్థిక మంత్రి ప్యాకేజీతో ఏ కుటుంబం తమ జీవనానికి, తిండికి, మందులకు, పిల్లల స్కూలు ఫీజుకు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు.
ఇది ప్యాకేజీ కాదు మరో పచ్చి మోసం అంటూ ఆయన హిందీలో ట్వీట్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని తీవ్రంగా విమర్శించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలంటే పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలకు నేరుగా ధన రూపంలో సహాయం అందాలని అన్నారు. రుణ హామీ అంటే రుణం కాదని, అప్పులపాలైన వ్యాపారికి ఏ బ్యాంకు రుణం ఇవ్వదని ఆయన వ్యాఖ్యానించారు.
Economic package a hoax says Rahul gandhi