Saturday, February 1, 2025

ఆర్థికసర్వే..కాంగ్రెస్‌కు చెంపదెబ్బ

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ తెలంగాణ మోడల్ విజయానికి
ఆర్థిక సర్వే సాక్షం కాంగ్రెస్ అబద్ధపు
ప్రచారాలకు తెర బిఆర్‌ఎస్ పాలనలో
వ్యవసాయం, నీటిపారుదల, మహిళల
సాధికారతలో అగ్రస్థానంలో తెలంగాణ
ఇప్పటికైనా పదేళ్ల ప్రగతిని కొనసాగించి
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
తెలంగాణ ఘనతను చాటిన ఆర్థిక సర్వే
బిఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌రావు

(మొదటిపేజీ తరువాయి)
కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీగా పని చేయాలని సూచించారు. సమగ్ర, సమతుల, సమగ్రాభివృద్ధిని మరోసారి ప్రతిబింబించింది
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే 2024- 25 తెలంగాణ రాష్ట్రం గత దశాబ్దంలో సాధించిన సమగ్ర, సమతుల, సమగ్రాభివృద్ధిని మరోసారి ప్రతిబింబించిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతిని సర్వే స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. ఆర్థిక సర్వే ప్రకారం, తెలంగాణ స్వంత ఆదాయ వనరులలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రం 88 శాతం ఆదాయాన్ని స్వయంగా సేకరించుకోవడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ఇది గట్టి సమాధానం అని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రంపై ఆధారపడకుండా, తెలంగాణ స్వంతంగా ఆదాయాన్ని పెంచుకోవడం బిఆర్‌ఎస్ హయాంలో అమలైన ఆర్థిక పరిపాలనా నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో మొత్తం సాగుబడి భూమిలో 90 శాతానికి పైగా ప్రాంతం సాగునీటి సదుపాయాన్ని పొందుతోందని సర్వే చెప్పిన వాస్తవం సాగునీటి ప్రాజెక్టులపైన కాంగ్రెస్ ప్రాపగండాను తిప్పికొట్టిందన్నారు. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి విప్లవాత్మక ప్రాజెక్టుల కారణంగా సాధ్యమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆర్థిక సర్వే గట్టి సమాధానం ఇచ్చిందన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రస్థాయిలో కొనసాగుతుండటం బిఅర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రణాళికల విజయాన్ని చూపిస్తున్నాయని తెలిపారు. 2017లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జిఇఎస్) సందర్భంగా ప్రకటించిన వి హబ్ ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తల పొత్సాహించేందుకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన వి హబ్, ఇప్పుడు రాష్ట్ర మహిళలకు అద్భుత అవకాశాలను అందిస్తూ, వేలాది స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తోందని చెప్పారు.

కెసిఅర్ గురుతులు, చరిత్రను ఎవరు చేరపలేరు
తెలంగాణ దేశంలోనే 100 శాతం తాగునీటి సరఫరా అందించిన తొలి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని, ఈ ఘనత మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ద్వారానే సాధ్యమైందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్ట్ విజయవంతమై, ప్రతి ఇంటికి నల్లా నీరు అందజేస్తోందని, దేశంలోని అనేక రాష్ట్రాలకు మిషన్ భగీరథ ఆదర్శంగా నిచిందని తెలిపారు. సర్వే ప్రకారం, హై పెర్ క్యాపిటా జిఎఎస్‌విఎతో తెలంగాణ సేవల రంగంలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని, తెలంగాణ ఐటి, స్టార్టప్, ఫిన్‌టెక్ రంగాల్లో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదిగిందన్నారు.

గ్లోబల్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం బిఆర్‌ఎస్ పాలనలో ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి వేగంగా కొనసాగినదానికి నిదర్శనమని కెటిఆర్ అన్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని ఆర్థిక సర్వే తిప్పికొట్టాయని, తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా, ఆర్థిక సర్వే వంటివి కాంగ్రెస్‌కి కనువిప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు. ఆర్థిక స్వావలంబన, వ్యవసాయ ప్రగతి, మహిళా శక్తీకరణ, నీటి పారుదల వంటి అన్ని రంగాల్లోనూ తెలంగాణ బిఆర్‌ఎస్ పాలనలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ నిజాలు ఎవరికీ ఇష్టం లేకపోయినా, తెలంగాణ ప్రజలకు మేలు చేసిన హయాం ముమ్మాటికీ బిఆర్‌ఎస్ పాలననే అని, కెసిఅర్ గురుతులు, చరిత్రను, తెలంగాణకు ఆయన నాయకత్వంలో అందిన ఫలాలును ఎవరు చేరపలేరని కెటిఆర్ అన్నారు.

ఆర్థిక సర్వే రిపోర్ట్ బోగస్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌కు చెంపపెట్టు : మాజీ మంత్రి హరీష్ రావు
కేంద్రం విడుదల చేసిన ఎకనమిక్ సర్వే 2024-25 నివేదిక బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటి సమాధానం అని మాజీ మంత్రి హరీష్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15 పెద్ద రాష్ట్రాలతో పోల్చితే 88 శాతం సొంత పన్నుల రాబడుల్లో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిని చాటిందని అన్నారు. మిషన్ భగీరథపై చేస్తున్న కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ 100 శాతం రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని తెలిపారు.

ఐటీలో తెలంగాణ మేటి అని మరోసారి తేల్చి చెప్పిన ఎకనిమిక్ సర్వే.. కర్ణాటకతో పాటు తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని వెల్లడించిందని పేర్కొన్నారు. కాళేశ్వరం సహా, తెలంగాణ నీటి పారుదల వ్యవస్థపై కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం శుద్ద తప్పు అని నివేదిక తేల్చి చెప్పిందని తెలిపారు. అత్యధిక ఇరిగేటెడ్ ఏరియాతో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచి, దేశానికి ఆదర్శంగా నిలిచిందని తేటతెల్లం చేసిందని, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో వి హబ్ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొందని చెప్పారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక, ఐటీ, నీటి పారుదల, మహిళా సాధికారతలో సాధించిన ఘనతను ఆర్థిక సర్వే లెక్కలతో సహా వివరించిందని, ఎకనమిక్ సర్వే రిపోర్టు కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారం బోగస్ అని పేర్కొందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News