25న ఢిల్లీలో ప్రదానం
డిజిటల్ సేవలను ప్రశంసిస్తూ
సిఎంకు లేఖ
మన హైదరాబాద్: సరళతరమై న వ్యాపార నిర్వహణ (ఈజ్ డూయింగ్ బిజినెస్)లో రాష్ట్రానికి అవార్డు దక్కింది. మీ సేవ పోర్టల్, వ్యాపార నిర్వహణలో అత్యుత్త మ విధానాలను అమలుచేస్తున్నందుకు తెలంగాణకు ఈ పురస్కారం దక్కింది. ఈ నెల 25 వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించే ది డీజీ టెక్ కాన్ క్లేవ్ 2022లో ఎకనామిక్ టైమ్స్ ఈ పు రస్కారాన్ని అందచేయనుంది. సరళతర వ్యా పార నిర్వహణ (ఈజ్ డూయింగ్ బిజినెస్)లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమం గా ఉన్నాయని ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఎకనామిక్ టైమ్స్ కొనియాడింది. నీతి ఆయో గ్, కేంద్ర ఐటి- ఎలక్ట్రానిక్స్ శాఖలతో పాటు స్వీడన్, ఇజ్రాయెల్ సహకారంతో కాన్ క్లేవ్ ను నిర్వహిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో
డిజిటల్ రంగం ద్వారా ప్రజలకు మెరుగైన సే వలను అందిస్తున్న రాష్ట్రాలను గుర్తించేందుకు ఈ కాన్ క్లేవ్‌కు నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా డెలాయిట్ టచ్ తో మట్స్ ఇండియా సహకారాన్ని తీసుకున్నట్టు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసే నివేదికలతో పాటు క్షేత్రస్థాయిలో విస్తృతమైన పరిశోధన, అధ్యయనం చేసిన తరువాతనే తాము తెలంగాణను ఎంపిక చేశామని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. సరళతర వ్యాపార నిర్వహణ, ఆ రంగంలో సంస్కరణల కోసం అమలుచేస్తున్న కార్యాచరణ ప్రణాళికతో పాటు మీసేవ పోర్టల్ తో ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని సత్కరించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు రాసిన లేఖలో ఎకనామిక్ టైమ్స్ ఎడిటర్ టి.రాధాకృష్ణ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ పురస్కారం నిదర్శనం: మంత్రి కెటిఆర్
ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన పురస్కారం నిదర్శనమని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల్లో కూడా రాష్ట్రం ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పనులపై విస్తృతమైన పరిశోధనలు చేసిన ఎకనామిక్ టైమ్స్ పత్రికకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ పురస్కారం నిదర్శనమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.