Monday, December 23, 2024

ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

- Advertisement -
- Advertisement -

ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకు పురస్కారం

స్టాక్‌హోం : ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి (2022) ముగ్గురిని వరించింది. ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకుగాను ప్రముఖ ఆర్థిక వేత్తలు బెన్ షాలోమ్ బెర్నాంకే, డగ్లస్ డబ్లు. డైమండ్, ఫిలిప్ హెచ్ డైబ్‌విగ్‌కు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేస్తున్నట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఈ ముగ్గురూ ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా ఆర్థిక సం క్షోభాల సమయంలో బ్యాంకుల పాత్రపై కీలక పరిశోధనలు జరిపారు.బ్యాంకుల పతనాన్ని నివా రించడం ఎందుకు ముఖ్యం? అనేది వారి పరిశోధనల్లో ముఖ్యాంశం. బ్యాంకులు ఎందుకు ఉన్నా యి? ఆర్థిక సంక్షోభాల సమయంలో వాటిపై తక్కువ ప్రభావం పడేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

బ్యాంకుల పతనాలు… ఆర్థిక సంక్షోభాల కు ఏ విధంగా దారి తీస్తాయి? తదితర ఆధునిక బ్యాంకింగ్ పరిశోధనలకు ఈ ముగ్గురు ఆర్థిక వేత్త లు 1980లోనే పునాదులు వేశారు. ఆర్థిక మార్కెట్లను నియంత్రించడంలో, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో వారి విశ్లేషణలు ఆచరణాత్మక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. డిపాజిట్లు, డిపాజిట్ ఇన్సూరెన్సులు, బ్యాంకు రుణాల విషయం లో డైమండ్, డైబ్‌విగ్ పరిశోధనలు బ్యాంకులకు ఎంతో మేలు చేశాయి. పురస్కార గ్రహీత విశ్లేషణలు.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, బెయిలవుట్‌లను నివారించగల సామర్ధాన్ని మెరుగుపరిచాయని నోబెల్ ప్రైజ్ కమిటీ ఛైర్మన్ టోర్ ఎల్లింగ్‌సెన్ చెప్పారు. గత ఏడాది కూడా ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ఇచ్చారు. అమెరికాకు చెందిన ఆర్థిక వేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డి. ఆంగ్రిస్ట్, గైడో డబ్లూ. ఇంబెన్స్‌లకు ఈ పురస్కారం దక్కడం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News