అటవీశాఖలో కొందరు అధికారుల
నిర్వాకం ‘ఎకోటూరిజం’ అధ్యయనం
ముసుగులో అడ్డగోలు వ్యవహారం
సంబంధిత మంత్రి, ఉన్నతాధికారి
అనుమతి లేకుండానే కెన్యా,
టాంజానియాకు జిఎడి అనుమతితో
వెళ్లొచ్చిన అధికారుల బృందం
సిఎంకు, కేంద్ర అటవీశాఖకు ఫిర్యాదు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆ శాఖ ఉన్నతాధికారికి తెలియకుండానే ఆ శాఖలో పనిచేసే ఏడుగురు అధికారులు విదేశీ టూర్‌కు వెళ్లారు. ఈ వి దేశీ పర్యటనకు ఆ శాఖ ఉన్నతాధికారితో పాటు సంబంధిత మంత్రి అనుమతి ఉండాలన్నా నిబంధనను సైతం పక్కనబెట్టి ఈ ఏడుగురు అధికారులు విదేశీ టూర్‌కు వెళ్లడం విశేషం. ఈ విదేశీ టూర్‌కు విచిత్రంగా జిఏడి అనుమతి ఇవ్వడం, ఈ విష యం కనీసం మంత్రి కొండా సురేఖకు కూడా తెలియకపోవడంతో ఈ విషయం కాస్త వివాదస్పదమయ్యింది. ప్రస్తుతం ఈ ఏడుగురు అధికారుల టూ ర్‌కు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారి సిఎంకు, కేంద్ర అటవీశాఖకు ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలిసింది.రాష్ట్రంలో ఎకోటూరిజాన్ని అభివృద్ధి చే యడానికి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా అటవీశాఖ, టూరిజం, రెవెన్యూ, దేవాదాయ శాఖకు చెందిన అధికారులు కొన్ని దేశాలు, రాష్ట్రాల్లో పర్యటించి ఆయా దేశాలు, ఆయా రా ష్ట్రాల్లో అక్కడ ఎకో టూరిజానికి సంబంధించి ఎ లాంటి చర్యలు చేపట్టారు, అక్కడి పాలసీకి సంబంధించిన విధి, విధానాలు అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది.
అందులో భాగంగా ఎకో టూరిజం పాలసీ రూపకల్పనలో అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ముఖ్యపాత్రదారిగా అటవీశాఖ ఉండాలని ప్రభుత్వం సూచించింది.ప్రభుత్వ ఆదేశాలను ఆసరాగా చేసుకొని కొందరు అటవీశాఖకు చెందిన అధికారులు ఆ శాఖ పిసిసిఎఫ్ (అటవీ సంరక్షణ అధికారి, డోబ్రియల్‌కు) సమాచారం ఇవ్వకుండా, కనీసం ఆయన అనుమతి లేకుండానే కెన్యా, టాంజానియా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అక్కడ పర్యటించారు. అయితే, ఈ ఏడుగురు విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు అటవీశాఖ ఉన్నతాధికారి డోబ్రియల్ నుంచి అనుమతి తీసుకోకుండా జిఏడి నుంచి మాత్రమే అనుమతి తీసుకొని ఈ పర్యటనకు వెళ్లడం విశేషం. ఈ పర్యటనకు సంబంధించి కనీసం సమాచారం మంత్రి కొండా సురేఖకు కూడా తెలియదని ఆ శాఖ అధికారులు పేర్కొంటుండడం గమనార్హం.
ఈనెల 18వ తేదీన కెన్యా పర్యటనకు జిఏడి అనుమతి
ఈనెల 18.02.2025వ తేదీన జిఓ ఆర్‌టి నెంబర్ 224ను జారీ చేస్తూ జిఏడి స్పెషల్ (ఏ) డిపార్ట్‌మెంట్ ఈ విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కెన్యా పర్యటనకు వెళ్లిన వారిలో సునీతా ఎం.భగవత్ (అడిషనల్ పిసిసిఎఫ్) (అడ్మిన్), శాంతారం (ఐఎఫ్‌ఎస్, ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్), డా.సునీల్ ఎస్.హేరామంత్ (ఐఎఫ్‌ఎస్, జూపార్క్, డైరెక్టర్), డా.జి.చంద్రశేఖర్ రెడ్డి (ఐఎఫ్‌ఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, టు సిఎం), రాజశేఖర్ పెట్లా (ఐఎఫ్‌ఎస్, నల్లగొండ, డిఎఫ్‌ఓ), రోహిత్ గోప్డీ, (ఐఎఫ్‌ఎస్, డిఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్), ఎల్.రంజిత్ నాయక్, (ఐఎఫ్‌ఎస్, ఈడీ ఎకో టూరిజం, టిజిఎఫ్‌డిసి)లు అధికారులు ఉన్నారు. ఈ ఏడుగురిలో ఒకరిద్దరూ వారి దగ్గరి బంధువులు కూడా ఉండడం, వారికి ఈ పర్యటనకు ఎలాంటి సంబంధం లేకున్నా కావాలనే వారిని కూడా ఈ పర్యటనకు తీసుకెళ్లారని అటవీశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
సింగపూర్, ఆస్ట్రేలియా పర్యటనలు….
కెన్యా పర్యటనకు ముందు సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలకు అధికారుల బృందాలను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొందరు ఈ రెండు దేశాల పర్యటన జరగకుండా సచివాలయంలో ఫైలును తొక్కిపెట్టి ముందుగా కెన్యా పర్యటనకు వెళ్లినట్టుగా అటవీశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. సింగపూర్, ఆస్ట్రేలియా పర్యటనలో ఈ అధికారుల పేర్లు లేకపోవడం వల్లే ఈ పర్యటన ఫైలును తొక్కిపట్టి, ఈ ఏడుగురు అధికారులు కెన్యా, టాంజానియాలకు వెళ్లారని ఆ శాఖ అధికారులు విమర్శిస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారులతో పాటు ఈ పర్యటనకు దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులను తీసుకెళ్లాలని గతంలో ప్రభుత్వం సూచించినా కనీసం ఈ విషయాన్ని వారు పట్టించుకో లేదని, కావాలనే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆ శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే 12 సర్యూట్లలో 40 ఎకో టూరిజం స్పాట్‌ల
ఎకో టూరిజం పాలసీ అమలుకు తెలంగాణ అటవీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహారించనుంది. ఈ కార్పొరేషన్ ద్వారానే ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. ఎకో టూరిజం ప్రాజెక్టుల ఆమోదానికి ఎకో టూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఎకో టూరిజం కేంద్రాల అభివృద్ధికి పిపిపి పద్ధతుల్లో నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సిఎస్ ఆర్), ఇతర నిధులను సమీకరించాలని అటవీశాఖ భావిస్తోంది. మొత్తంగా ఎకో టూరిజం కేంద్రాల నిర్వహణ అనేది పూర్తిస్థాయిలో ప్రభుత్వ పరంగా అటవీశాఖ ద్వారా నిర్వహించకుండా ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యతలు ఇస్తే మరింత పకడ్బందీగా అమలు చేసే అవకాశం ఉందని అధి కారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 12 సర్యూట్లలో 40 ఎకో టూరిజం స్పాట్‌లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అడ్వెంచర్, రిక్రి యేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ వైల్డ్‌లైఫ్, హెరిటేజ్- కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని ఎకో టూరిజం ప్రదేశాలుగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అక్కడ పర్యటించారు. అయితే, ఈ ఏడుగురు విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు అటవీశాఖ ఉన్నతాధికారి డోబ్రియల్ నుంచి అనుమతి తీసుకోకుండా జిఏడి నుంచి మాత్రమే అనుమతి తీసుకొని ఈ పర్యటనకు వెళ్లడం విశేషం. ఈ పర్యటనకు సంబంధించి కనీసం సమాచారం మంత్రి కొండా సురేఖకు కూడా తెలియదని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటుండడం గమనార్హం.
ఈనెల 18వ తేదీన కెన్యా పర్యటనకు జిఏడి అనుమతి
ఈనెల 18.02.2025వ తేదీన జిఓ ఆర్‌టి నెంబర్ 224ను జారీ చేస్తూ జిఏడి స్పెషల్ (ఏ) డిపార్ట్‌మెంట్ ఈ విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కెన్యా పర్యటనకు వెళ్లిన వారిలో సునీతా ఎం.భగవత్ (అడిషనల్ పిసిసిఎఫ్) (అడ్మిన్), శాంతారం (ఐఎఫ్‌ఎస్, ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్), డా.సునీల్ ఎస్.హేరామంత్ (ఐఎఫ్‌ఎస్, జూపార్క్, డైరెక్టర్), జి.చంద్రశేఖర్ రెడ్డి (ఐఎఫ్‌ఎస్), రాజశేఖర్ పెట్లా (ఐఎఫ్‌ఎస్, నల్లగొండ, డిఎఫ్‌ఓ), రోహిత్ గోప్డీ, (ఐఎఫ్‌ఎస్, డిఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్), ఎల్.రంజిత్ నాయక్, (ఐఎఫ్‌ఎస్, ఈడీ ఎకో టూరిజం, టిజిఎఫ్‌డిసి)లు అధికారులు ఉన్నారు. అయితే ఈ పర్యటనలో ఒకరిద్దరూ దగ్గరి బంధువులు కూడా ఉండడం, వారికి ఈ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని కావాలనే వారిని కూడా ఈ పర్యటనకు తీసుకెళ్లారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
సింగపూర్, ఆస్ట్రేలియా పర్యటనలు….
కెన్యా పర్యటనకు ముందు సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలకు అధికారుల బృందాలను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొందరు ఈ రెండు దేశాల పర్యటన జరగకుండా సచివాలయంలో ఫైలును తొక్కిపెట్టి ముందుగా కెన్యా పర్యటనకు వెళ్లినట్టుగా అటవీశాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సింగపూర్, ఆస్ట్రేలియా పర్యటనలో ఈ అధికారుల పేర్లు లేకపోవడం వల్లే ఈ పర్యటన జరగకుండా ముందుగా ఈ అధికారులు కెన్యా, టాంజానియాలకు వెళ్లారని ఆ శాఖ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారులతో పాటు ఈ పర్యటనకు దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులను తీసుకెళ్లాలని గతంలో ప్రభుత్వం సూచించినా కనీసం ఈ విషయాన్ని వారు పట్టించుకోలేదని ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే 12 సర్యూట్లలో 40 ఎకో టూరిజం స్పాట్‌ల
ఎకో టూరిజం పాలసీ అమలుకు తెలంగాణ అటవీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహారించనుంది. ఈ కార్పొరేషన్ ద్వారానే ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. ఎకో టూరిజం ప్రాజెక్టుల ఆమోదానికి ఎకో టూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఎకో టూరిజం కేంద్రాల అభివృద్ధికి పిపిపి పద్ధతుల్లో నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సిఎస్ ఆర్), ఇతర నిధులను సమీకరించాలని అటవీశాఖ భావిస్తోంది. మొత్తంగా ఎకో టూరిజం కేంద్రాల నిర్వహణ అనేది పూర్తిస్థాయిలో ప్రభుత్వ పరంగా అటవీశాఖ ద్వారా నిర్వహించకుండా ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యతలు ఇస్తే మరింత పకడ్బందీగా అమలు చేసే అవకాశం ఉందని అధి కారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 12 సర్యూట్లలో 40 ఎకో టూరిజం స్పాట్‌లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అడ్వెంచర్, రిక్రి యేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ వైల్డ్‌లైఫ్, హెరిటేజ్- కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని ఎకో టూరిజం ప్రదేశాలుగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.