Friday, November 15, 2024

11గంటలు.. ప్రశ్నల వర్షం

- Advertisement -
- Advertisement -

Ed An onslaught of questions on chikoti praveen

చీకోటి చీకటి
దందాపై ఇడి
ప్రశ్నల దాడి
హవాలా లావాదేవీలపై
ఆరా ప్రవీణ్,
సంపత్, మాధవ
రెడ్డిలను వేర్వేరుగా
విచారించిన
దర్యాప్తు సంస్థ
తారలు, నేతలతో
లింకుపై ప్రశ్నలు

మన : క్యాసినో హవాలా కేసులో చికోటితో పాటు మరో ఇద్దరిని సోమవారం నాడు బషీర్‌బాగ్‌లోని ఇడి కార్యాలయంలో ఇడి అధికారులు హవాలా లావాదేవీలపై 11 గంటల పాటు ప్రశ్నించారు. ఇడి జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో చెన్నై, బెంగళూరుకు చెందిన 8మంది ఇడి అధికారుల బృందం చికోటి ప్రవీణ్, సంపత్,మాధవరెడ్డిలను వివిధ కోణాల్లో విచారించారు. ఈక్రమంలో చికోటి ప్రవీణ్, సంపత్, మాధవరెడ్డిలు బ్యాంక్ స్టేట్‌మెంట్స్, నోటీస్ కాపీతో ఇడి కార్యాలయానికి వచ్చారు. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తమ అడ్వకేట్‌ను తీసుకొచ్చారు. క్యాసినో వ్యవహారంతో పాటు హ వాలా రూపంలో నగదు బదిలీలపై ఇడి అధికారులు ఐదుగురిని వేర్వేరు గదులలో ఉంచి ప్రశ్నించారు. అలాగే సినీ రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలు, వాట్సాప్‌లో ఉన్న కీలక సమాచారంపై విచారణ చేపట్టారు. చీకోటి ఫోన్, ల్యాప్‌టాప్‌లలో పెద్ద మొత్తంలో హవాలా జరిగినట్లు గుర్తించిన ఇడి అధికారులు సినీ, రాజకీయ నేతలకు చెల్లింపులపై అధికారులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో 10మంది సినీ ప్రముఖులతో పాటు 20 మంది రాజకీయ నేతలు, 200 మంది కస్టమర్స్ లిస్ట్ ముందుంచి ఇడి ప్రశ్నించింది.

అలాగే నేపాల్, శ్రీలంక, ఇండోనేసియా, థా య్‌లాండ్ తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు ఫ్లైట్, హోటల్స్ బుకింగ్‌పై లభించిన ఆధారాలపై విచారించారు. కాసినోలో కాయిన్లకు ఆ దేశ కరెన్సీతో జరిగే మార్పిడి, ప్రైజ్ మనీ చెల్లించడానికి ఫారెన్ కరెన్సీలోకి మార్చి ఇవ్వ డం, హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించడంలో సహకరించిన హవాలా ఏజెంట్ల పాత్రపై ఆరా తీసినట్లు తెలిసింది. కాగా విచారణలో విదేశాలలో నిర్వహించిన క్యాసినో క్యాంపులకు ఆరా ధ్య ట్రావెల్స్ అధినేత సంపత్ ఫ్లైట్స్, హోటల్స్ బుకింగ్ చేసినట్లు విచారణలో ఇడి అధికారులు గుర్తించారు. అదేవిధంగా నేపాల్, శ్రీలంక, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాల్లో క్యాసినో క్యాంపులకు సంబంధించి వందలాది మంది పంటర్లు రూ. 3- నుంచి రూ. 5 లక్షల చొప్పున చికోటి ప్రవీణ్‌కు చెల్లించినట్లు విచారణలో తేలింది. క్యాం పుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపం లో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిచినట్లు కీలక ఆధారాలను ఇడి అధికారులు సేకరించారు. క్యాసినో వ్యవహారంలో కమీషన్ల రూపంలో చికోటి ప్రవీణ్ సంపాదించిన సొ మ్మునూ హవాలా మార్గంలో హైదరాబాద్ నగరానికి తరలించిన అంశంపై అధికారులు పదేపదే ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలావుండగా ప్రవీ ణ్, మాధవ రెడ్డి, ట్రావెల్స్ అధినేతతో పాటు బేగంబజార్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్లకు ఇడి నోటీసులు జారీ చేసింది. తాజా విచారణలో ముగ్గురిని మాత్రమే విచారించగా మిగిలిన వారిని అనతికాలంలో ఇడి విచారించనుంది.

నగదు బదిలీపై విచారణ

కాసినో ఈవెంట్ల నిర్వహణలో భారీ స్థాయిలో చేతులు మారిన నగదు, హవాలా ద్వారా దేశ సరిహద్దులు దాటిన తీరు, బ్యాంకు ఖాతాల నుంచి వేర్వేరు వ్యక్తులకు బదిలీ అయిన మొత్తాలపై ఇడి ప్రశ్నించారు.
ఆయనతో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న స్నేహితుడు మాధవ రెడ్డి, విమా న ప్రయాణాలను సమకూర్చిన ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ అధినేతను కూడా అధికారులు ప్రశ్నించారు. ఇడి సోదాలలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్, వాట్సాప్ చాటింగ్, లాప్‌టాప్ డేటా, బ్యాంకు పాసు పుస్తకాలు, నగదు బదిలీలపై ప్రవీణ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. పేకాట ఆడేందుకు హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళినవారికి చెల్లించిన డబ్బులు, ప్రమోషన్ కోసం సెలెబ్రిటీలు, సినీ తారలతో రూపొందించిన వీడియోలకు చేసిన ఖర్చు, వారికి పారితోషికం రూపంలో చెల్లించిన నగదు తదితర అన్ని వివరాలపై ప్రశ్నించినట్లు తెలిసింది.క్యాసినో వ్యవహారంలో ప్రముఖులతో నిందితుల కు ఉన్న సంబంధాలపై ఇడి ఆరా తీసింది. ము ఖ్యంగా వీరితో వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయా? లేక వ్యాపారంలో వారి పెట్టుబుడులు ఏమైనా ఉన్నా యా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులో చికోటి నిర్వహించిన కాసినో ఈవెంట్లకు ఎవరెవరు వచ్చారన్న అంశాలపై ఇడి అధికారులు ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇరవై మంది ప్రజా ప్రతినిధులు సుమారు 280 మందికిపైగా కస్టమర్ల వివరాలపై ఆరా తీసినట్లు తెలిసింది.

ట్వీట్ కలకలం

ఇడి విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్ పేరుతో ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ’నన్ను బలిపశువును చేయాలని, నా చేత ఈ పనులు చేయించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను.. అందరికీ ఒకటే న్యా యం.. అంటూ వచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చీకోటి ప్రవీణ్ పేరుతో వెలుగులోకి వచ్చిన ట్వీట్ మెసేస్‌కు ఒక మహిళ కూ డా స్పందించి ఏంటండీ.. వీడు మాట్లాడేది.. నాకు ఎందుకో చాలా బాధగా ఉంది.. అంటూ తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారానే పంచుకుంది. అయితే చికోటి పేరిట వచ్చిన ట్వీట్ ఫేక్ అని తేలింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News