Thursday, January 23, 2025

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై ఇడి, ఎన్ఐఎ దాడులు

- Advertisement -
- Advertisement -

 

ED and NIA raids on offices of Popular Front of India

హైదరాబాద్: దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఎ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై ఎన్‌ఐఎ దర్యాప్తు చేస్తోంది. యుపి, కేరళ, కర్నాటక, తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం సహా పలు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పిఎఫ్‌ఐకి చెందిన వ్యక్తుల నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఎపి, తెలంగాణలో ఎన్‌ఐఎ సోదాలు చేసింది. నిజామాబాద్, నెల్లూరు జిల్లాల్లో ఎన్‌ఐఎ పలువరిని అదుపులోకి తీసుకొని వారిని హైదరాబాద్‌లో ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 106 మందిని అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే కోణంలో ఎన్‌ఐఎ దర్యాప్తు చేస్తోంది. ఉగ్ర సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారనే కోణంలో ఎన్‌ఐఎ దర్యాప్తు చేస్తోంది. పిఎఫ్‌ఐ, విద్యార్థి విభాగానికి నిధులు సమకూర్చిన అంశంలో ఇడి శోధిస్తుంది. 40 ప్రాంతాలలో ఇడి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్‌ఐఎ, ఇడి సంయుక్త ఆపరేషన్ జరుపుతున్నట్టు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. మొత్తం వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలోని పిఎఫ్‌ఐ కార్యాలయంలో ఎన్ఐఎ సోదాలు చేస్తోంది. చాంద్రాయణగుట్టలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News