మనతెలంగాణ/హైదరాబాద్: బ్యాంకులను మోసంచేసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై పిసిహెచ్ గ్రూప్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్‌ను ఇడి అరెస్ట్ చేయడంతో పాటు రూ.6.18 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. కాగా పిసిహెచ్ గ్రూప్ సంస్థల పేరిట బల్వీందర్ సింగ్ వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సుమారు రూ.370 కోట్ల మోసానికి పాల్పడ్డారని చెన్నై, బెంగళూరులో సిబిఐ గతంలో కేసులు నమోదు చేసింది. సిబిఐ కేసుల ఆధారంగా నిందితుడు మనీలాండరింగ్ పాల్పడ్డాడని గుర్తించిన ఇడి అధికారులు తాజాగా పిసిహెచ్ గ్రూపునకు చెందిన రూ.6.18కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. ఈక్రమంలో హైదరాబాద్, బెంగళూరులో 11 ఆస్తులను ఇడి అటాచ్ చేసింది. పిసిహెచ్ గ్రూప్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్ బినామీ పేరిట ఉన్న ఆస్తులను ఇడి అటాచ్ చేసినట్లు తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీల ద్వారా తమ వ్యక్తిగత, సంస్థల ఖాతాలకు మళ్లించుకున్నట్లు తేలిందని ఇడి అధికారులు వెల్లడించారు.
ED Arrest Director Balvinder Singh of Pch Ltd