చెన్నై: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు వి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించేందుకు బుధవారం తెల్లవారుజామున ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద మంత్రి భోరున విలపించారు.
మంగళవారం మంత్రి సెంథిల్ బాలాజీ నివాసంపై దాడి జరిపి సోదాలు నిర్వహించిన ఇడి అధికారులు బుధవారం తెల్లవారుజామున ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఇడి అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం బాలాజీని గట్టి భద్రత మధ్య చెన్నైలోని ఒమందురర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది.
కారులో కూర్చున్న బాలాజీ నొప్పితో రోదిస్తుండగా బయట గుమికూడిన ఆయన అనుచరులు ఇడికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. బాలాజీని ఆసుపత్రిలోని ఐసియుకు మార్చారని, ఆయన ఆరెస్టుపై ఇడి ఎటువంటి ప్రకటన చేయలేదని డిఎంకె ఎంపి, న్యాయవాది ఎన్‌ఆర్ ఇళంగో తెలిపారు.
ఇలా ఉండగా సెంథిల్ బాలాజీ చికిత్స పొందుతున్నారని, ఈ వ్యవహారాన్ని తాము న్యాయపరంగా తేల్చుకుంటామని డిఎంకె ప్రభుత్వ మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ బెదిరింపు రాజకీయాలకు తాము భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
நேத்து வரைக்கும் எப்படி இருந்த மனுஷன்……
இன்னைக்கு….
ஊழல் / கைதுனு பண்ணிட்டா தண்டனை முடிந்து 6 வருடங்கள் தேர்தல் அரசியலுக்கு வரமுடியாது…
கிட்டத்தட்ட அரசியல் அஸ்தனம்…????
வாழ்க்கை ஒரு வட்டம்னு சும்மாவா சொன்னாங்க……#SenthilBalaji #SenthilBalajiArrest pic.twitter.com/ZSRhap8xnx
— H͡i͡n͡d͡h͡u͡i͡s͡m͡ 🕉️ (@Tamilnaduu) June 14, 2023
அஞ்சு கட்சி மாறுவாராம்.. அதிகாரத்துலேயே இருப்பாராம்.. ஷெட்டு போட்டு strategical-ஆ தேர்தலை சந்திப்பாராம்.. பாட்டிலுக்கு பத்து ரூவா அடிப்பாராம்.. தம்பி மாமியா சீதனமா குடுத்ததுனுவாராம்.. இவரு ஓட்ற ஓலாவெல்லாம் கேட்டுட்டு ஒய்யாரமா வாக்கிங் போறதுக்கு ED என்ன ஸ்டாலினா? #SenthilBalaji pic.twitter.com/jumstikKgG
— Surjith Kumar (@imSurjithKumar) June 13, 2023