Sunday, January 19, 2025

వివో, లావా అధికారులను అరెస్టు చేసిన ఇడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం చైనా కంపెనీ వివో మొబైల్‌కు చెందిన ముగ్గురు అధికారులను, లావాకు చెందిన ఒకరిని అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈ అరెస్టు జరిపినట్టు అధికారులు తెలిపారు. అరెస్టయిన అధికారుల్లో చైనా పౌరుడు గ్వాంగ్‌వెన్ కియాంగ్, లావా ఇంటర్నేషనల్ ఎండీ హరియోమ్ రాయ్, చార్టర్డ్ అకౌంటెంట్లు రాజన్ మాలిక్, నితిన్ గార్గ్ కూడా ఉన్నారు.

ఏడాది క్రితం ఇడి దేశవ్యాప్తంగా 48 ప్రదేశాలలో వివో మొబైల్స్, దాని 23 అనుబంధ కంపెనీలను దర్యాప్తు చేసి, ఆ తర్వాత ఈ అరెస్టు చర్య తీసుకుంది. చైనాకు అక్రమంగా నిధులను తరలించే ఉద్దేశంతో అనేక కంపెనీలను భారత్‌లో విలీనం చేశారని ఇడి ఆరోపించింది. అదనంగా వివో మొబైల్స్ ఇండియా తన అమ్మకాల ఆదాయంలో సగం (రూ. 1.25 లక్షల కోట్లు) చైనాకు బదిలీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News