ఢిల్లీ వక్ఫ్‌బోర్డ్‌లోఆర్థిక అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్‌ఎల్‌ఎ అమానతుల్లా ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం అరెస్ట్ చేసింది. ఈడీ సిబ్బంది తన ఇంటికి చేరుకోగానే తనను అరెస్ట్ చేసేందుకే అధికారులు వచ్చినట్టు అమానతుల్లా ఖాన్ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. తనను అరెస్ట్ చేసి ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకోవడమే సెంట్రల్ ఏజెన్సీ ఉద్దేశమని ఆరోపించారు.
తనపై ఈడీ తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు. ఢిల్లీ వక్ఫ్‌బోర్డు నియామకాల్లో అవకతవకలపై 2016లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ సమయంలో ఢిల్లీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా అమానతుల్లా ఖాన్ ఉనా నరు. తప్పుడు నియామకాల ద్వారా వ్యక్తిగత లబ్ధి పొందడమే కాక, ఢిల్లీ ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించారని సిబిఐ ఆరోపించింది. అనంతరం దీనిపై మనీలాండరింగ్ దర్యాప్తును ఈడీ ప్రారంభించింది.