Monday, January 20, 2025

రేషన్ స్కామ్‌లో బెంగాల్ మంత్రి అరెస్టు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత జ్యోతిప్రియో మల్లిక్‌ను శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అదుపులోకితీసుకుంది.రేషన్ స్కామ్‌లో 20 గంటలు ప్రశ్నించిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున ఆయనను అరెస్టు చేసింది. జ్యోతిప్రియో బెంగాల్ ప్రభుత్వంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి మాజీ వ్యక్తిగత సహాయకుడి నివాసంతో పాటుగా ఎనిమిది ఫ్లాట్లలో సోదాలు జరిపినట్లు ఇడి వెల్లడించింది. అలాగే వారిని ప్రశ్నించింది.

20 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం మంత్రిని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. అక్కడినుంచి ఇడి కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా సిఆర్‌పిఎఫ్ జవాన్లను మంత్రి ఇంటివద్ద మోహరించారు. నేను కుట్రలో బాధితుడ్ని’ అని అరెస్టు సమయంలో మంత్రి వ్యాఖ్యానించారు. కాగా ఈ దాడులపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. మంత్రి ఆరోగ్యం క్షీణిస్తే బిజెపి, దర్యాప్తు సంస్థపై కేసులు పెడతామని హెచ్చరించారు. అవినీతి కేసులకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ మంత్రివర్గంలో అరెస్టయిన రెండో మంత్రి మల్లిక్. ఇంతకు ముందుగత ఏడాది సూలు ఉద్యోగాల కుంభకోణంలో మరో మంత్రి పార్థా చటర్జీని ఇడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News