Saturday, November 16, 2024

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఉపకార్యదర్శి సౌమ్యా చౌరాసియాపై ఈడి కేసు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ సెక్రటరీ ర్యాంకు ఉద్యోగి సౌమ్యా చౌరాసియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) శుక్రవారం అరెస్టు చేసింది. మనీ లాండరింగ్, బొగ్గు లెవీ కుంభకోణం సంబంధిత ఆరోపణల కింద అరెస్టు చేశారని తెలిసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఆమె చాలా శక్తిమంతమైన ప్రభుత్వ అధికారి(బ్యూరోక్రాట్). అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం(పిఎంఎల్‌ఏ) సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసి ప్రశ్నిస్తునట్లు భోగట్ట. అరెస్టు చేశాక ఈడి ఆమెకు హెల్త్ చెకప్ కూడా చేసింది. ఆ తర్వాత ఆమెను సిఆర్‌పిఎఫ్ సిబ్బంది వెంట రాగా కోర్టుకు తీసుకెళ్ళారు.

మనీలాండరింగ్ కేసులో ఈడి ఇదివరకే అనేక దాడులు నిర్వహించింది. అక్టోబర్‌లో ఆ రాష్ట్ర ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్‌ని , మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసింది. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఫిర్యాదు అందాక ఈడి ఈ మనీలాండరింగ్ దర్యాప్తును మొదలెట్టింది. “ఛత్తీస్‌గఢ్‌లో రవాణ అయిన ప్రతి టన్ను బొగ్గుకు రూ. 25 అక్రమంగా వసూలు చేసిన కుంభకోణం జరిగింది. ఆ వసూలు ముఠాలో(కార్టెల్) ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు, దళారులు ఉన్నారు” అన్నది ఆరోపణ. ఇదిలావుండగా ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్ గత వారం విలేకరులతో మాట్లాడుతూ ఈడి దాడులపై విమర్శలు గుప్పించారు. ఈడి తన పరిధులు దాటి కర్కశంగా రాష్ట్రంలో దాడులు జరుపుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News