Monday, December 23, 2024

ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Chitra Ramakrishna

న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణను అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీ ఉద్యోగుల స్నూపింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం ఢిల్లీ కోర్టు నుంచి విచారణకు అనుమతి పొందిన తర్వాత ఆమెను అరెస్టు చేసింది.రామకృష్ణను నాలుగు రోజుల కస్టడీలో విచారించేందుకు ప్రత్యేక న్యాయమూర్తి సునైనా శర్మ అనుమతించారు. గతంలో న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు మాజీ ఎన్‌ఎస్‌ఈ ఎండీని జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. ఈడి సమర్పించిన వినతి మేరకు న్యాయమూర్తి నిందితురాలిపై ‘ప్రొడక్షన్ వారెంట్’ జారీ చేశారు.

నిందితురాలిని హాజరుపరిచిన అనంతరం ఆమెను విచారించేందుకు ఈడీ కోర్టు అనుమతి తీసుకుంది. తనకు సహకరించలేదనే కారణంతో ఈడీ రామకృష్ణను అరెస్టు చేసింది.  కోర్టులో హాజరుపరిచి తొమ్మిది రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే కోర్టు ఆమెను నాలుగు రోజులపాటు ఏజెన్సీ  కస్టడీకి అనుమతించింది.  రామకృష్ణను సిబిఐ వేరే ప్రత్యేక కేసులో అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News