Thursday, December 19, 2024

జార్ఖండ్ మంత్రి ఆలంగిర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నాయకుడు, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగిర్ ఆలంను మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు బుధవారం అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండవ రోజు ఆరు గంటల పాటు ప్రశ్నించిన అనంతరం ఇడి జోనల్ ఆఫీసులో 70 ఏళ్ల ఆలంను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. మంగళవారం ఆయనను ఇడి అధికారులు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గత వారం ఆలం వ్యక్తిగత కార్యదర్శి, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్(52)ను, ఆయన నౌకరు జహంగిర్ ఆలం(42)ను ఇడి అధకిరులు అరెస్టు చేశారు. జహంగిర్ ఆలం ఫ్లాట్‌లో రూ. 32 కోట్లకు పైగా నగదును ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News