- Advertisement -
చండీఘడ్: పంజాబ్ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను సోమవారంనాడు ఇడి అరెస్టు చేసింది. బహిరంగ సభలో పాల్గొన్న సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు. అమర్‌ఘర్ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అయిన జశ్వంత్ సింగ్ మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవడం బిజెపి నైజాన్ని బయటపెడుతుందని ఆప్ నేత మాల్విందర్ కంగ్ ఆరోపించారు. 41 కోట్ల ఎగవేత కేసులో సీబీఐ గత ఏడాది సెప్టెంబర్‌లో జశ్వంత్ ఇంటితో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేసింది. ఆ తనిఖీల్లో 17 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, ప్రాపర్టీ డాక్యుమెంట్లను సీజ్ చేశారు. లుథియానాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మజ్రాపై కేసు బుక్ చేశారు.
- Advertisement -