Thursday, December 26, 2024

మనీ లాండరింగ్ కేసు: ఇడి అదుపులో సిబిఐ కోర్టు మాజీ జడ్జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన పంచ్‌కుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సుధీర్ పర్మర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పిఎంఎల్‌ఎ) నిబంధనల కింద కస్టడీలోకి తీసుకున్న మాజీ జడ్జిని శుక్రవారం కోర్టు ఎదుట హాజరుపరిచి కస్డడోడియల్ రిమాండ్‌ను ఇడి కోరనున్నట్లు వర్గాలు తెలిపాయి.

దర్యాప్తులో భాగంగా గురువారం పర్మర్‌ను మూడవసారి విచారణకు పలిపించిన ఇడి అధికారులు ఆయనను అరెస్టు చేయడానికి పంజాబ్ , హర్యానా హైకోర్టు అనుమతిని ముందుగానే పొందినట్లు వర్గాలు తెలిపాయి. పర్మర్ బంధువు అజయ్ పర్మర్, ఎం3ఎం అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రమోటర్లు బసంత్ బన్సల్, ఆయన కుమారుడు పంకజ్ బన్సల్, ఇరియో గ్రూపు అనే మరో రియల్ ఎస్టేట్ గ్రూపు ఎండి లలిత్ గోయల్‌ను ఇదే కేసులో ఇడి అధికారులు ఇదివరకే అరెస్టు చేశారు.

పంచ్‌కులలోని ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టులో సిబిఐ, ఇడి జడ్జిగా పనిచేస్తున సుధీర్ పర్మర్ ఇడి, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న నిందితులు రూప్ కుమార్ బన్సల్, అతని సోదరుడు బసంత్ బన్సల్, ఇరియో ఎండి లలిత్ గోయల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో హర్యానా పోలీసులకు చెందిన అవినీతి నిరోధక బ్యూరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సుధీర్ బన్సల్ అధికార దుర్వినియోగానికి, ముడుపుల స్వీకరణకు పాల్పడినట్లు ఎసిబి తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. దీంతో సుధీర్ పర్మర్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు సస్పెండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News