Saturday, November 23, 2024

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మాగుంట రాఘవ రెడ్డి అరెస్టు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో పెద్ద పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) శనివారం ఉదయం మాగుంట రాఘవ రెడ్డి ఉరఫ్ రఘును అరెస్టు చేసింది. ఆయన వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు. ఇటీవలి సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో రఘు పేరును నిందితుడిగా పేర్కొన్నారు. శనివారం అతడిని ఈడి ప్రశ్నించడానికి పిలిచింది, తర్వాత అరెస్టు చేసింది. ఈ కేసులో అతడి కస్టడీని ఈడి కోరనుంది. గత మూడు రోజుల్లో ఈడి చేసిన మూడో అరెస్టు ఇది. మాగుంటని రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఇదివరలో ఈడి పంజాబ్ వ్యాపారి గౌతమ్ మాల్హోత్రా, ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జీ విజయ్ నాయర్ సహాయకుడు రాజేశ్ జోషిని అరెస్టు చేసింది. గోవా ఎన్నికలకు నాయర్ నుంచి జోషికి డబ్బు అందిందని ఆరోపణ. ఆ డబ్బును ఎక్సైజ్ పాలిసీ కుంభకోణం ద్వారానే సముపార్జించారని ఆరోపణ. వారిని ప్రశ్నించడం ద్వారా మాగుంట రఘు అరెస్టు అయ్యారు. అమిత్ అరోరా ఒప్పుకోటు ఆధారంగా ఈ అరెస్టు జరిగిందని తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ ద్వారా సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నాయకులకు రూ. 100 కోట్లు అందాయని ఆరోపణ. ఇందులో మాగుంట రఘు పాత్ర స్పష్టం కావడంతో అతడిని అరెస్టు చేశారు.

దీనికి ముందు ఈడి వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీ, చెన్నై, నెల్లూరు ప్రాంగణాలలో సోదాలు నిర్వహించింది. మాగుంట రాఘవ రెడ్డిని ఇదివరలో అంటే అక్టోబర్‌లో సిబిఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News