Monday, November 18, 2024

నోట్ల రద్దు సమయంలో రూ.130 కోట్ల స్కామ్

- Advertisement -
- Advertisement -

నోట్ల రద్దు సమయంలో రూ.130 కోట్ల స్కామ్
25 మంది బంగారం వ్యాపారులు, 16 అకౌంటెంట్లపై ఇడి ఛార్జిషీట్

మనతెలంగాణ/హైదరాబాద్: నోట్ల రద్దు సమయంలో రూ.130 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ ముసద్దిలాల్ జ్యువెలర్స్‌తో పాటు మరో 24 మంది బంగారం షాపు యజమానులు, 16 మంది చార్టెడ్ అకౌంటెంట్లపై మంగళవారం ఇడి చార్జిషీట్ దాఖలు చేసింది. నోట్ల రద్దు జరిగిన రోజు రూ.130 కోట్లతో బంగారాన్ని కొన్నట్లు నకిలీ ఇన్వాయిస్‌తో బంగారం వ్యాపారులు ఆదాయాన్ని పొందినట్లు ఇడి అధికారులు గుర్తించారు. అదేవిధంగా నోట్ల రద్దు సమయంలో మనీ ల్యాండరింగ్ జరిగిన రూ.130 కోట్ల ఆస్తులను తాజాగా ఇడి అటాచ్ చేసింది. ముసొద్దిలాల్ జ్యుయలర్స్‌పై హైదరాబాద్ సిసిఎస్‌లో తొలి కేసు నమోదు కావడంతో ఆ కేసులోనూ ఇడి ఛార్జిషీట్ వేశారు. మనీలాండరింగ్ కేసులో ఇడి అధికారులు 25మంది బంగారం వ్యాపారులు, 16 మంది చార్టెడ్ అకౌంటెంట్లు వెరసి మొత్తం 41 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నోట్ల రద్దు సమయంలో పాత కరెన్సీతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జరిగినట్టు ఇడి గుర్తించింది.

అలాగే పాల్పడ్డ ముసద్దిలాల్‌తో పాటు కుటుంబ సభ్యులు పేర్లు చార్జిషీట్లో చేర్చిన ఇడి రూ.130 కోట్ల స్కామ్ జరిగినట్టు వివరించింది. బంగారం కొనుగోలు జరగకపోయినా నకిలీ ఖాతాదారుల పేర్ల మీద జువెలరీ షాపు యజమానులు నగదు బదిలీ చేసినట్టు గుర్తించింది.. ఇలా నోట్ల రద్దు సమయంలో 130 కోట్ల రూపాయలను జువెలరీ షాపుల యజమానులు మార్పిడి చేశారని బంగారం షాపు యజమానులతో పాటు చార్టెడ్ అకౌంటెంట్లపై సిసిఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఇడి విచారణ చేపట్టింది. తాజాగా ఇడి చార్జ్‌షీట్‌లో 25 మంది బంగారు వ్యాపారులు, 16మంది చార్టెడ్ అకౌంటెంట్లతో పాటు మరో కొంతమంది పేర్లను ఇడి పేర్కొంది.

ED attaches assets worth Rs 130 Cr in demonetisation scam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News