Monday, December 23, 2024

కార్వీ సంస్థకు చెందిన రూ.1,984 కోట్ల ఆస్తులను ఇడి అటాచ్

- Advertisement -
- Advertisement -

ED attaches Carvy assets worth Rs 1984 crore

మనతెలంగాణ/హైదరాబాద్: కార్వీ ఎండి పార్థసారథికి చెందిన షేర్లతో పాటు రూ.1,984 కోట్ల స్థిరాస్తులను అటాచ్ చేసినట్లు ఇడి అధికారులు తెలిపారు. కాగా సీజ్ చేసిన మొత్తం రూ. 1,984 కోట్లలో రూ. 213 కోట్లు విలువ చేసే భూములు, రూ. 438 కోట్ల రూపాయల షేర్లు, రూ. 1,280 కోట్ల విలువ చేసే ఇతర ఆస్తులును ఉన్నట్లు ఇడి అధికారులు వెల్లడించారు. పెట్టుబడిదారులకు చెందిన షేర్లను కార్వీ ఎండి పార్థసారథి బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. పలు బ్యాంకుల్లో దాదాపు రూ.2800కోట్ల రుణం తీసుకుని ఆయా రుణాలను డొల్ల కంపెనీలకు మళ్లించి సొంత పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారని ఇడి విచారణలో తేలింది.

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో హెచ్‌డిఎఫ్‌సి, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పార్థసారథితో పాటు, మరో నలుగురిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. సిసిఎస్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి అధికారులు మనీల్యాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 20వ తేదీన ఇడి అధికారులు పార్థసారథిని బెంగళూర్ నుంచి అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి చంచల్ గూడ జైలుకు తరలించారు. వివిధ బ్యాంకు రుణాలతో సొంత ఆస్తులు కొనుగోలు చేసిన కార్వీ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఈ సందర్భంగా ఇడి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News