Sunday, January 19, 2025

కార్వీ గ్రూపు ఆస్తులు అటాచ్

- Advertisement -
- Advertisement -

ED attaches Karvy Group assets

మనీల్యాండరింగ్ కేసు
రూ.110 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన ఈడి

హైదరాబాద్: మనీల్యాండరింగ్ కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్(కెఎస్‌బిఎల్)కు చెందిన రూ.110 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం అటాచ్ చేసింది. కంపెనీకి చెందిన ఆస్తులు భూమి, భవనాలు, షేర్‌హోల్డింగ్స్, నగదు, విదేవీ కరెన్సీ, బంగారు ఆభరణాల రూపంలో ఉన్న ఆస్తులను అటాచ్ చేసింది. క్లయింట్ల షేర్లను అక్రమంగా తనకా పెట్టి కార్వీ గ్రూపు రూ.2,800 కోట్లు రుణాలు పొందిందనే ఆరోపణలు రావడంతో ఈడి దర్యాప్తు చేపట్టింది. ఎన్‌ఎస్‌ఈ, సెబీ ఉత్తర్వులకు అనుగుణంగా క్లయింట్ సెక్యూరిటీలను విడుదల చేసిన అనంతరం ఈ రుణాలు నిరర్ధక ఆస్తులుగా పేరుకుపోయాయి. ఈ నిధులను కంపెనీ అనుబంధ సంస్థలకు మళ్లించిందని ఈడి పేర్కొంది. ఈ కేసులో ఈడి కెస్‌బిఎల్‌తో పాటు సిఎండి పార్ధసారధి, మిగత వారిపై మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఈడి గతంలో రూ.1984కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈడి ఇప్పటికే కంపెనీ సిఎండి పార్ధసారధి, గ్రూప్ సిఎఫ్‌ఎఓ హరికృష్ణను అరెస్టు చేయగా బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటికి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News