Wednesday, January 22, 2025

మహారాష్ర మంత్రి నవాబ్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

- Advertisement -
- Advertisement -

ED attaches properties of NCP Nawab Malik

ముంబై : మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) నిబంధనల ప్రకారం ఎనిమిది ఆస్తులను జప్తు చేసింది. విదేశాలకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం , మరికొందరికి వ్యతిరేకంగా దాఖలైన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఫిబ్రవరి 23 న నవాబ్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ తాత్కాలికంగా జప్తు చేసిన ఆస్తుల్లో నవాబ్ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న సోలిడస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెట్, మాలిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గోవావాలా కాంపౌండ్, మూడు ఫ్లాట్స్, రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా, మాలిక్ విడుదల కోసం దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వం లోని ధర్మాసనం అంగీకరించింది. అయితే విచారణ తేదీని ప్రకటించలేదు. ఆయన తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. మాలిక్ ఫిబ్రవరిలో దాఖలు దరఖాస్తును బోంబే హైకోర్టు తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News