Sunday, December 22, 2024

బెంగాల్ టీచర్ల స్కామ్.. మరో 163 కోట్లు ఇడి జప్తు

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసులో దళారి పాత్ర పోషించిన మధ్యవ్యక్తి ప్రసన్న కుమార్ రాయ్‌పై ఇడి విరుచుకుపడింది. ఈ వ్యక్తికి చెందిన రూ 163 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్లుబిఎస్‌ఎస్‌సి) సంబంధిత గ్రూప్ సి, డి కేటగిరి రిక్రూట్మెంట్లలో బారీ స్కామ్ సంచలనానికి దారితీసింది. ఈ అక్రమ ఆర్థిక వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం అయింది. టీచర్ల రిక్రూట్‌మెంట్ వ్యవహారంలో ఇప్పటికే ఇంతకు ముందు ఇడి వర్గాలు రూ 230 కోట్లకు పైగా ఆస్తులను స్వాధీనపర్చుకుంది. ప్రైమరీ టీచర్ల నియామకాల వ్యవహారంలో రూ 151 కోట్ల మేర ఆస్తులను జప్తు చేశారు.

ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామంలో రూ 163 కోట్ల మేర దళారి ఆస్తులను అటాచ్ చేయడంతో ఈ టీచర్ల నియామకాల వ్యవహారాలలో చేతులు మారిన డబ్బుల మొత్తం దాదాపుగా వేయికోట్ల రూపాయల స్థాయి దాకా చేరుకుంటున్నట్లు వెల్లడైంది. ప్రధాన సూత్రధారిగా బావిస్తున్న ప్రసన్న కుమార్ పేరిట ఉన్న ఐదు హోటళ్లు, రిసార్ట్‌లు, 230 భూ స్థలాలు, షాప్‌లు, 17 ఫ్లాట్‌లు అటాచ్డ్ జాబితాలో చేరాయి. ఇక ఆయన భార్య కాజల్ సోని రాయ్, ఓ బినామీ కంపెనీ శ్రీ దెర్గా డిల్‌కామ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కూడా అక్రమ ఆర్థిక వ్యవహారాల కట్టడి చట్టం పరిధిలో ఇప్పుడు జప్తు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2022లో బెంగాల్‌లో జరిగిన టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ మమత బెనర్జీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చింది. అవినీతిపరమైన ప్రకంపనలకు దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News