Thursday, January 23, 2025

ఢిల్లీ లిక్కర్ స్కామ్…. హైదరాబాద్ లోనే 25 ప్రాంతాలలో సోదాలు…

- Advertisement -
- Advertisement -

ED attack on Hyderabad in Delhi liquor scam

 

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఇడి దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇడి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒక్క హైదరాబాద్‌లోనే 25 ప్రాంతాలలో 25 బృందాలుగా ఏర్పడి ఇడి సోదాలు చేస్తోంది. ఢిల్లీకి చెందిన ఇడి అధికారుల ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే హైదరాబాద్‌లో ఇడి రెండుసార్లు సోదాలు చేసిన విషయం తెలిసిందే. కోకాపేటలోని రామచంద్రపిళ్లై నివాసంలో గతంలో ఇడి సోదాలు చేపట్టింది. నానక్‌రామ్ గూడాలోని డిస్టిలరీస్ కార్యాలయంలో ఇడి సోదాలు చేపట్టింది. రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్, ఎల్‌ఎల్‌పి పేరుతో రామచంద్ర పిళ్లై కంపెనీలు అభిషేక్ బోయిన్‌పల్లి, గండ్ర ప్రేమసాగర్‌రావును డైరెక్టర్లుగా నియమించుకున్నారు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఇడి దూకుడు పెంచింది. డిల్లీ, ఎపి, తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో ఇడి సోదాలు చేపడుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నెల్లూరులోని పలు ప్రాంతాలలో సోదాలు చేపడుతోంది. మొత్తం 40కి పైగా ప్రదేశాల్లో ఇడి అధికారులు సోదాలు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News