- Advertisement -
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి ఎంఎల్‌సి కవితను ఈడి మళ్లీ పిలిచింది. నేడు(మంగళవారం) ఢిల్లీ కార్యాలయానికి రావాలని లేఖ ద్వారా కోరింది. ఈడి పిలుపుపై స్పందించిన కవిత తనకు ప్రతిగా తన న్యాయ సలహాదారును పంపించారు. ఇదిలావుండగా మార్చి 11న ఎంఎల్‌సి కవితకు చెందిన ఫోన్‌ను ఈడి అధికారులు సీజ్ చేయగా, ఈ నెల 21న కవిత తన తొమ్మిది ఫోన్లను ఈడికి అందజేశారు. అయితే జప్తు చేసిన ఫోన్లను తెరవడానికి సాక్షిగా కవిత గానీ, ఆమె ప్రతినిధి గానీ రావాలని ఈడి అధికారులు కోరారు. ఈ మేరకు న్యాయ సలహాదారు సోమా భారత్‌కు ఆథరైజేషన్ ఇచ్చి తన ప్రతినిధిగా ఈడి కార్యాలయానికి విచారణకు పంపినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత ఇప్పటి వరకు ఈడి విచారణకు అనేక సార్లు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ నెల 11,20,21 తేదీల్లో ఈడి విచారణను ఎదుర్కొన్నారు.
- Advertisement -