- Advertisement -
హైదరాబాద్: రూ.700 కోట్ల విలువైన కార్వీ షేర్లలను ఇడి స్తంభింపచేసింది. మనీలాండరింగ్ చట్టం కింద కార్వీపై కేసు నమోదు చేసింది. హైదరాబాద్ సిసిఎస్, సైబరాబాద్‌లో కార్వీపై బ్యాంకులకు ఇడి అధికారులు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, కార్వీ సంస్థ బ్యాంకుల నుంచి రూ.2.873 కోట్ల రుణాలు తీసుకుందని, షేర్ హోల్డర్ల షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా కార్వీ సంస్థ రుణం తీసుకుందని, బ్యాంకుల రుణాన్ని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారని ఇడి తెలిపింది.
- Advertisement -