ఎసిబి ఎఫ్‌ఐఆర్ ఆధారంగా
ఇసిఐఆర్ నమోదు చేసిన దర్యాప్తు సంస్థ
మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘించినట్లు అభియోగం అర్వింద్ కుమార్,
బిఎల్‌ఎన్‌రెడ్డిపైనా నమోదు బ్రిటన్‌కు చెందిన
ఏస్ నెక్స్ కంపెనీపైనా ఇడి కేసు
మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ కేసులో కీలక పరిణా మం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇడి రంగంలోకి దిగింది. ఎసిబి ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై ఇడి కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ -కార్ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్, ఫెమా ఉ ల్లంఘన కింద ఇడి కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ -కార్ రేసులో ప్రమేయం ఉన్న కెటిఆర్, అరవింద్ కు మార్, బిఎల్‌ఎన్ రెడ్డిపై ఇడి కేసు నమోదు చేసింది. ఇసిఐఆర్ నమోదు చేసినట్లు ఇడి పేర్కొంది. యూకెకు చెందిన ఏస్ నెక్ట్‌పైనా కేసు నమో దు చేసింది. రూ.55 కోట్లు ఏస్ నెక్ట్‌కు బదిలీ అయినట్లు,
ఆర్‌బిఐ అనుమతి లేకుండా రూ. 46 కోట్లను అధికారులు డాలర్స్‌గా మార్చి పంపినట్లు ఇడి గుర్తించింది. అంతకుముందు ఫార్ములా ఈకారు రేస్ కేసులో తెలంగాణ ఎసిబి డిజి విజయ్‌కుమార్‌కు హైదరాబాద్ ఇడి జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ లేఖ రాశారు. కెటిఆర్‌పై నమోదైన కేసు వివరాలను తమకు అందజేయాలని ఆ లేఖలో హైదరాబాద్ ఇడి జాయింట్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటుగా హెచ్‌ఎండిఎ సంస్థ అకౌంట్ నుంచి ఎంత మొత్తం నిధులను బదిలీ చేశారు అని పూర్తి వివరాలు కూడా కావాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ నగదు బదిలీకి సంబంధించి ఏ ఏ తేదీలలో ట్రాన్సాక్షన్స్ జరిగాయో వివరాలతో సహా పంపాలని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇక ఇదే సమయంలో మున్సి పల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఫిర్యాదు కాపీని కూడా తమకు పంపాలని ఇడి జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఎసిబి డిజికి రాసిన లేఖలో పేర్కొన్నారు.