Sunday, December 22, 2024

ఇడి… కేసుల గారడీ!

- Advertisement -
- Advertisement -

గత దశాబ్ద కాలంలో ఇడి పని తీరుపై గణాంకాలను పరిశీలిస్తే ఇడి కేసుల్లో ఉన్న డొల్లతనం ఏమిటో స్పష్టంగా కనపపడుతున్నది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంటుకు సమర్పించిన గణాంకాల ప్రకారం 2014 2024 మధ్యకాలంలో ‘మనీలాండరింగ్’ చట్టం కింద ఇడి మొత్తం 5,297 కేసులు పెట్టింది. అయితే అందులో సాక్షాధారాలతో రుజువైనవి కేవలం 40 మాత్రమే. అంటే సక్సెస్ రేటు కనీసం ఒక్క శాతం కూడా లేదు. అంత కంటే తక్కువే. ఇక మిగతా కేసుల సంగతి, వాటిల్లో అరెస్టు అయిన వారి పరిస్థితి ఏమిటనేది ఆలోచించాల్సిన విషయమే. ఈ వివరాలను కేంద్రం ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన బుధవారం రోజే సుప్రీం కోర్టు కూడా ఇదే అంశంపై ఇడి పై కీలక వ్యాఖ్యలు చేయటం యాదృచ్ఛికమే.

కేంద్ర దర్యాప్తు సంస్థ ఇడి (ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఇటీవల కాలంలో తన పని తీరును అనుసరించి పలు విమర్శలను విపక్షాల నుండి, ప్రజల నుండి ఎదుర్కొంటున్నది. ఇడిని గురించి తరచుగా ఈ మధ్య మాస్ మీడియాలోనూ, మెయిన్ మీడియాలోనూ ప్రధానంగా చర్చ జరుగుతున్నది. అయితే ఆ సంస్థ సాధించిన ఘన విజయాల వల్ల అయితే పర్వాలేదు. సంతోషమే కానీ, తన సంశయ పూర్వక ప్రవర్తన వల్ల మీడియా విమర్శలతో రచ్చబండకెక్కడమే బాగోలేదు. గత దశాబ్ద కాలంలో ఇడి పని తీరుపై గణాంకాలను పరిశీలిస్తే ఇడి కేసుల్లో ఉన్న డొల్లతనం ఏమిటో స్పష్టంగా కనపపడుతున్నది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంటుకు సమర్పించిన గణాంకాల ప్రకారం 2014 2024 మధ్యకాలంలో ‘మనీలాండరింగ్’ చట్టం కింద ఇడి మొత్తం 5,297 కేసులు పెట్టింది.

అయితే అందులో సాక్షాధారాలతో రుజువైనవి కేవలం 40 మాత్రమే. అంటే సక్సెస్ రేటు కనీసం ఒక్క శాతం కూడా లేదు. అంత కంటే తక్కువే. ఇక మిగతా కేసుల సంగతి, వాటిల్లో అరెస్టు అయిన వారి పరిస్థితి ఏమిటనేది ఆలోచించాల్సిన విషయమే. ఈ వివరాలను కేంద్రం ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన బుధవారం రోజే సుప్రీం కోర్టు కూడా ఇదే అంశంపై ఇడి పై కీలక వ్యాఖ్యలు చేయటం యాదృచ్ఛికమే. ఇలా వందల వేల సంఖ్యలో కేసులు పెడుతూ అందులో సాక్షాల ఆధారంగా శిక్షలు పడినవి ఒక్క శాతం కూడా లేకపోవడం ఏమిటని సుప్రీం కోర్టు విస్మయాన్ని ప్రకటించింది. అందుకే ఇడి నేర పరిశోధనా తీరును మెరుగు పరుచుకోవాలని సుప్రీంకోర్టు కాస్త ఘాటుగానే మందలించింది. ఇంతకు ఇడి కేసుల్లో లోపం ఎక్కడుంది? అంటే ఆ మధ్య ఓ న్యాయ నిపుణుడు ఇడి లోగుట్టు బండారాన్ని వివరంగా బయటపెట్టాడు.

ఇడి ముందుగా ఓ నలుగురైదుగురిని అరెస్టు చేస్తుంది. వారిలోంచి ఒకరిని ఆశ చూపో, బెదిరించో అప్రూవర్‌గా మారుస్తుంది.వాళ్ళు ఇడి అధికారులు చెప్పినట్లు మిగతా వారికి వ్యతిరేకంగా మౌఖికంగా సాక్ష్యం చెప్పడానికి అంగీకరించి ఆపై వాంగ్మూలంలో ఇడి అధికారులు ఏమి చెప్పమన్నారో పూసగుచ్చినట్లుగా అలాగే అప్పచెబుతారు. ఇడి ఆ అప్రూవర్ చెప్పిన సాక్షాన్ని రికార్డు చేస్తుంది. ఈ సాక్ష్యం ఆధారంగా మిగతా వారి మీద కేసులు పెడతారు. అయితే శాస్త్రీయంగా సరైన సాక్షాధారాలు లేకుండానే నోటి మాటపై ఆధారపడి కేసులేలా పెడతారని సుప్రీం కోర్టు ఇడిని తప్పుపట్టింది. ఈ మౌఖిక వాంగ్మూలంపై ఆధారపడి ముందుగా ఎవరినైతే అరెస్టు చేసి లోపల వేయాలనుకుంటారో ఆ పని అర్జెంటుగా చేసేసి ఆపై తీరిగ్గా, తాపీగా బెయిల్ రాకుండా సెక్షన్లను బనాయిస్తారు. అప్పుడు నెమ్మదిగా సాక్షాల సేకరణ చేపడతారు.

ఈ తల్లకిందుల దర్యాప్తును చేపట్టడం వల్లనే కోర్టుల్లో కేసులు నిలబడటం లేదని తేలింది. పైగా ‘తాము అవినీతి భరతం పడతాం’ అంటూ బీరాలు పలికే ఇడి అధికారులే లంచం స్వీకరిస్తూ సిబిఐకి బహిరంగంగా దొరికిపోయి ఇడి ఆఫీసు పరువు తీసిన ఉదంతాలున్నాయి. తాజాగా ఓ సీనియర్ ఇడి అధికారి నిందితుడి దగ్గర నుంచి రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన ఘటన సంస్థ పరువును బజారుకీడ్చింది. గత ఏడాది తమిళనాడులోనూ లంచం కేసులోనే ఇడి అధికారే అరెస్ట్ కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ వైఫల్యాలకు అసలు కారణం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజకీయ లక్ష్యాల సాధన కోసం ఇడిని ఓ ఆయుధంలా మార్చింది అనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి.

రాజకీయాల్లో అవినీతి ప్రక్షాళనకే ఇడిని ఉపయోగిస్తున్నామని పాలక బిజెపి చెబుతుంటే, తమ దారికి రాని వారిని లొంగదీసుకునేందుకు ఆ దర్యాప్తు సంస్థను ఉసిగొల్పుతున్నారని విపక్షాల ఆరోపిస్తున్నాయి. ఇడి వ్యవహార శైలి, కేసులు చతికిలబడుతున్న తీరే అందుకు నిదర్శనం. కేంద్రం దర్యాప్తు సంస్థల పని తీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడమే ఈ సమస్యకు పరిష్కారం. పార్లమెంటరీ కమిటీ పర్యవేక్షణ తప్పనిసరి చేయాలి. ఆ కమిటీ ముందు సంస్థల బాధ్యులు ఎప్పటికప్పుడు హాజరై వాంగ్మూలాన్ని సమర్పించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాలి. ఆ మొత్తం వ్యవహారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి. అప్పుడే కేసులు నిగ్గు తేలుతుంది. దర్యాప్తు సంస్థల పని తీరూ మెరుగుపడుతుంది. దేశ ప్రజలకు వ్యవస్థలపై నమ్మకమూ పెరుగుతుంది.

డాక్టర్ కోలాహలం
రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News