Monday, January 20, 2025

ప్రతిపక్షాలపై ఇడి, సిబిఐ ఏకపక్ష ప్రయోగం: సుప్రీంలో పిటిషన్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను అరెస్టు చేయడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)లతోసహా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏకపక్షంగా ప్రయోగించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సారథ్యంలో 14 రాజకీయ పార్టీలు శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.కాగా ఈ పిటిషన్ ను ఏప్రిల్ 5న విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కాంగ్రెస్, డిఎంకె, ఆర్‌జెడి, బిఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర 14 ప్రతిపక్ష పార్టీల తరఫున సీనియర్ న్యాయవాది ఎఎం సింఘ్వీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఆయన ఈ విషయాన్ని కోర్టులో ప్రస్తావించగా దీనిపై ఏప్రిల్ 5న విచారణ జరుపుతామనిచీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలియచేసింది. ఇడి, సిబిఐ నమోదుచేసిన కేసులలో 95 శాతం కేసులు ప్రతిపక్ష నాయకులపైనేనని, తాము అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత మార్గదర్శకాలను అడుగుతున్నామని సింఘ్వీ ధర్మాససనాన్ని కోరారు. ప్రతిపక్ష నాయకులలను సిబిఐ, ఇడి అరెస్టు చేయడానికి ముందు, అరెస్టు చేసిన తర్వాత పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రతిపక్షాలు తమ పిటిషన్ ద్వారా కోరుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News